365తెలుగు డాట్ ఆన్ లైన్ న్యూస్ , ఏప్రిల్ 28,2025: సినీ ఇండస్ట్రీలో ఎవరి పరిచయం లేదు.. వారెవరో ఎవరికీ తెలియదు. అయితే సినిమా అంటే చెప్పలేనంత ప్రేమ, అభిరుచి, ఉత్సాహం అదే వారిని ముందడుగు వేసేలా చేసింది. తెలుగు సినిమాలో అతి పెద్ద మ్యూజికల్ డ్రామా రూపొందించేలా చేసింది. ఆ చిత్రమే ‘నిలవే’. సౌమిత్ రావు, శ్రేయాసి సేన్ జంటగా నటించిన ఈ చిత్రానికి సౌమిత్ రావు , సాయి వెన్నం దర్శకత్వం వహించారు. POV ఆర్ట్స్ వ్యూ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తాహెర్ సినీ టెక్‌తో సౌజన్యంతో సాయి వెన్నం, గిరిధర్ రావు పోలాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Also read this…“Nilave: A Groundbreaking Telugu Musical Drama Unveils Soul-Stirring Teaser”
ఇది కూడా చదవండి…TFJA ఆధ్వర్యంలో ఫీనిక్స్ ఫౌండేషన్ & శంకర్ ఐ హాస్పిటల్ నిర్వహించిన ఉచిత ‘ఐ స్క్రీనింగ్’ క్యాంప్‌కు విశేష స్పందన
సోమవారం ఈ సినిమా టీజర్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఇందులో అర్జున్ (సౌమిత్ రావు) అనే వ్యక్తి, తన ఒంటరి జీవితాన్ని కష్టంగా గడుపుతూ ప్రేమ కోసం తాపత్రయ పడుతూ ఉంటాడు. అలాంటి అతని జీవితంలోకి.. శ్రేయాసి సేన్.. ప్రవేశించి అతని జీవితంలో కొత్త కాంతిని తీసుకొస్తుంది. ఇక టీజర్ మొత్తం.. ఆ అమ్మాయి కోసం అతను ఎంత దూరమైనా వెళ్తారు అనేదాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేశారు.
“నిలవే” టీజర్ నిడివి కేవలం 155 సెకండ్లు మాత్రమే.. అయినప్పటికీ.. ప్రేక్షకుల హృదయాలను ఆకట్టుకుంది అనడంలో సందేహం లేదు. అద్భుతమైన విజువల్స్.. మనసును తాకే సంగీతంతో, ప్రతి ఫ్రేమ్ ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా.. ఈ చిత్రంపై అంచనాలను కూడా పెంచేసింది.
సౌమిత్ రావు, శ్రేయాసి సేన్ కెమిస్ట్రీ ఈ సినిమాకి హైలైట్ గా నిలబడింది అని టీషర్ట్ చూస్తేనే అర్థమవుతుంది. వీరితో పాటు హర్ష చెముడు, సుప్రియా ఐసోలా, రూపేష్ మారాపు, జీవన్ కుమార్, గురురాజ్, సిద్ధార్థ్ గోల్లపూడి, అనాల సుశ్మిత,ఇతరులు సహాయక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాకి కళ్లాన్ నాయక్ అందించిన సంగీతం మరింత హైలైట్ గా నిలవనుంది. వెంకట్ కొణకండ్ల, సంజనా కృష్ణ ఈ చిత్రానికి సహ నిర్మాతలు.
Also read this…TFJA, Phoenix Foundation & Shankar Eye Hospital’s “Free Eye Screening Camp” Receives A Great Response
ఇది కూడా చదవండి…“చిరంజీవి: ‘మైండ్‌సెట్ షిఫ్ట్’ పుస్తకావిష్కరణలో తన విజయప్రయాణం, దృఢ సంకల్పం పై ఆలోచనలు”
నటీనటులు:
సౌమిత్ రావు, శ్రేయాసి సేన్, హర్ష చేముడు, సుప్రియా ఐసోలా, రూపేష్ మారాపు, జీవన్ కుమార్, గురురాజ్, సిద్ధార్థ్ గోల్లపూడి, అనాల సుశ్మిత ,ఇతరులు.
టెక్నికల్ టీమ్ :
బ్యానర్ – POV ఆర్ట్స్ వ్యూ ప్రొడక్షన్స్
నిర్మాతలు: సాయి వెన్నం, గిరిధర్ రావు పోలాటి
దర్శకత్వం – సౌమిత్ రావు, సాయి వెన్నం
సహ-నిర్మాతలు: వెంకట్ కొణకండ్ల, సంజనా కృష్ణ, తాహెర్ సినీ టెక్
సంగీతం: కళ్లాన్ నాయక్
సినిమాటోగ్రఫీ: దిలీప్ కే కుమార్
అడిషనల్ సినిమాటోగ్రఫీ – జగదీష్ వర్మ
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: అన్వేష్ పెరటి, అజయ్ కుమార్ పుప్పల
లైన్ ప్రొడ్యూసర్లు: సునందా ఐథాని, సుష్రిత్ దేవి
పాటలు: ఎమ్‌వి.ఎస్. భారద్వాజ్
అడిషనల్ లిరిక్స్ – కోటి
ప్రొడక్ష్ డిజైనర్స్- కట్టి శివరామ కృష్ణ, జియా ఘోష్
అడిషనల్ ప్రొడక్షన్ డిజైనర్ – నూరా సయ్యద్
ఎడిటర్: సత్య.జి
మేకప్ అండ్ హెయిర్ – రవడ శీను, నవీన్ చౌదరి
పి ఆర్ ఓ: నాయుడు సురేంద్ర కుమార్ – ఫణి కందుకూరి (బియాండ్ మీడియా)