365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, ఆగస్టు 16,2025: భారతదేశంలోని అతిపెద్ద స్వదేశీ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ZEE5 తన ప్రేక్షకులకు అద్భుతమైన సినిమాటిక్ అనుభవాన్ని అందిస్తూ దూసుకుపోతోంది. ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకుల కోసం వరుసగా సిరీస్‌లు, సినిమాలు విడుదల చేస్తూ ZEE5 ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
ఇలాంటి విజయం కోసం ఇటీవల ‘మోతెవరి లవ్ స్టోరీ’ విడుదలై, ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. గ్రామీణ తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ డ్రామా-కామెడీ సిరీస్‌లో అనిల్ గీలా ,వర్షిణి ప్రధాన పాత్రల్లో నటించారు. ఆగస్టు 8న ప్రీమియర్ అయిన ఈ సిరీస్ మూడు రోజులలోనే 4 లక్షలకు పైగా వ్యూయర్స్ను రాబట్టి ZEE5 ప్రపంచ ట్రెండింగ్ చార్ట్స్‌లో శిఖరానికి చేరింది.
Read This also…After Mothevari Love Story’s Success, ZEE5 Telugu Launches Affordable Rs.99/Month Subscription..
ఈ కంటెంట్‌ను మరింత అందుబాటులోకి తీసుకురావడానికి, ZEE5 తెలుగు ₹99 ప్రత్యేక నెలవారీ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ ద్వారా వీక్షకులు:
డాల్బీ అట్మాస్ ఆడియోతో 4K నాణ్యతలో తెలుగు కంటెంట్ను 30 రోజులు ఆస్వాదించవచ్చు.

ఈ సబ్‌స్క్రిప్షన్‌ను గరిష్టంగా రెండు పరికరాల్లో యాక్సెస్ చేసుకోవచ్చు.
ప్రాంతీయ వినోదానికి తన నిబద్ధతను మరింత విస్తరించుకుంటూ, ZEE5 ఇప్పుడు ఇతర భాషలకు కూడా ₹99 నెలవారీ ప్లాన్‌లను అందిస్తోంది, వీటిలో హిందీ+పంజాబీ+భోజ్‌పురి, తమిళం, కన్నడ, మలయాళం, మరాఠీ+గుజరాతీ, బంగ్లా+ఒడియా ఉన్నాయి.
ఈ సరసమైన ప్రాంతీయ సబ్‌స్క్రిప్షన్‌లతో ZEE5 భారతదేశంలోని ప్రతీ ఇంటి, ప్రతీ కుటుంబం వరకు నాణ్యమైన వినోదాన్ని చేరువ చేస్తూ, ప్రేక్షకుల అంచనాలను మించి సేవ అందిస్తోంది.
ఈరోజే ZEE5 తెలుగు ₹99 నెలవారీ ప్లాన్ను సబ్‌స్క్రైబ్ చేసి, అంతులేని వినోదాన్ని ఆస్వాదించండి.
