365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ముంబై, నవంబర్ 26,2024: సుస్థిర వ్యవసాయ సొల్యూషన్స్‌ను అందించే అంతర్జాతీయ సంస్థ యూపీల్, సీహెచ్4 గ్లోబల్ వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నాయి. మీథేన్ ఉద్గారాలను తగ్గించే సీహెచ్4 గ్లోబల్‌కి చెందిన దాణా సప్లిమెంట్‌ను నిత్యం కోట్ల కొద్దీ పశువులకు అందుబాటులోకి తెచ్చేందుకు ఇది ఉపయోగపడనుంది.
బహుళ దశలవ్యాప్తంగా విస్తరించి ఉండే, బహుళ సంవత్సరాల ఒప్పందం కింద యూపీల్, సీహెచ్4 గ్లోబల్ కలిసి కీలక పశుసంపద మార్కెట్లయిన భారత్, బ్రెజిల్, అర్జెంటీనా, ఉరుగ్వే, పరాగ్వే దేశాలు లక్ష్యంగా సమగ్రమైన మార్గదర్శ ప్రణాళికను రూపొందిస్తాయి. ప్రపంచంలోని మొత్తం పశు సంపదలో 40 శాతం ఈ దేశాల్లోనే ఉంది.
ఈ మార్కెట్లలో సీహెచ్4 గ్లోబల్‌కి చెందిన మీథేన్ టేమర్™ పశు దాణా అడిటివ్‌లను పంపిణీ చేసేందుకు అవసరమయ్యే నిర్దిష్ట వ్యాపార మోడల్స్‌ను ఈ భాగస్వామ్యం కింద నెలకొల్పనున్నారు.
పర్యావరణ అనుకూల పశు దాణా సొల్యూషన్స్‌ను ఉపయోగించడం ద్వారా ఉద్గారాలను గణనీయంగా తగ్గించుకోవడంలో పశుసంపద రంగానికి తోడ్పాటు అందించాలనేది ఈ భాగస్వామ్యం లక్ష్యం.
మీథేన్ టేమర్ అనేది సీహెచ్4 గ్లోబల్ వినూత్నమైన ఫ్లాగ్‌షిప్ ఉత్పత్తి. ఇది అస్పరాగోప్సిస్ సముద్రపు నాచు (Asparagopsis seaweed) ఆధారంగా ఫార్ములేట్ చేయబడిన పశు ఆహార సప్లిమెంట్. సూచించిన విధంగా ఉపయోగించిన సందర్భాల్లో పశువులు విడుదల చేసే ఎంటెరిక్ మీథేన్ వాయువులను తొంభై శాతం వరకు తగ్గించగలిగే సామర్థ్యం దీనికి ఉందని అధ్యయనాల్లో వెల్లడైంది.
పశువుల జీర్ణక్రియ వల్ల విడుదలయ్యే మీథేన్ వాయువులు అంతర్జాతీయంగా గ్రీన్‌హౌస్ గ్యాస్ ఉద్గారాలకు కారణమవుతున్నాయి. ఇవి మానవ ప్రేరేపిత మీథేన్‌కి ఇదే అతి పెద్ద మూలకారకంగా ఉంటున్నాయి.
ఫార్ములేట్ చేసిన సప్లిమెంట్, యూపీఎల్‌కి ఉన్న ప్రస్తుత ఫీడ్ ఫార్ములేషన్లకు మీథేన్ టేమర్™ను అనుసంధానిస్తుంది. ఇందుకోసం మార్కెట్‌పై కంపెనీకి గల అవగాహన, లక్షిత మార్కెట్లలో కస్టమర్లతో సంబంధాలు, పంపిణీ నెట్‌వర్క్ తోడ్పడుతుంది.
“మా OpenAg విధానంలో పురోగతికి సంబంధించి భాగస్వామ్యాలు కీలకంగా ఉంటాయి. గ్రీన్‌హౌస్ వాయువులను తగ్గించే ప్రయత్నాల్లో వ్యవసాయం కూడా కీలకపాత్ర పోషించగలదని తెలియజేసేందుకు ఈ భాగస్వామ్యం తోడ్పడగలదు. కర్బన ఉద్గారాలతో పోలిస్తే గ్లోబల్ వార్మింగ్‌కి మీథేన్ ముప్ఫై రెట్లు అధికంగా కారకమవుతోంది.
ఇటీవలి నివేదికల ప్రకారం 8,00,000 సంవత్సరాల్లో ఇది గరిష్ట స్థాయుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. కాబట్టి దీన్ని తగ్గించడం మనకు అత్యంత ప్రాధాన్యతాంశం కావాలి. పశుసంపద రంగ వృద్ధికి ఇదొక కొత్త మోడల్ కాగలదు. దీన్ని అంతర్జాతీయ స్థాయిలో కూడా వినియోగంలోకి తీసుకురావచ్చు.
మీథేన్‌ను తగ్గించే టెక్నాలజీలను వినియోగించడం ద్వారా పరిశ్రమ నెట్-జీరో లక్ష్యాల సాధనకు మరింత చేరువ కావచ్చు. పర్యావరణంపై వ్యవసాయ రంగపు సానుకూల ప్రభావాన్ని తెలియజేయవచ్చు” అని యూపీఎల్ చైర్మన్, గ్రూప్ సీఈవో జై ష్రాఫ్ తెలిపారు.
“మీథేన్ టేమర్‌ను అంతర్జాతీయంగా వేగవంతంగా వినియోగంలోకి తెచ్చే దిశగా యూపీఎల్ వంటి మార్కెట్ దిగ్గజంతో జట్టు కట్టడం మాకు సంతోషకరమైన విషయం. భారీ స్థాయిలో ఎంటెరిక్ మీథేన్ తగ్గింపు సొల్యూషన్స్ అవసరాలను తీర్చే దిశగా మేము కృషి చేస్తున్న నేపథ్యంలో, కీలక మార్కెట్లలో విస్తృతంగా కార్యకలాపాలు, రైతులతో విశ్వసనీయమైన సంబంధాలు ఉన్న యూపీఎల్ మాకు సముచిత భాగస్వామి కాగలదు” అని సీహెచ్4 గ్లోబల్ ప్రెసిడెంట్,సీఈవో స్టీవ్ మెల్లర్ తెలిపారు.