Fri. Jan 3rd, 2025
urvashi-rautela_365

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, ఏప్రిల్ 12,2023: యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ అఖిల్ అక్కినేని స్టైలిష్ ఫిల్మ్ మేకర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో స్పై యాక్షన్ థ్రిల్లర్ ఏజెంట్‌లో నటించనున్నారు.

ఈ పాన్-ఇండియా సినిమాలో హీరోయిన్ సాక్షి వైద్య ప్రధాన పాత్ర పోషిస్తోంది.

తాజాగా హీరో, హీరోయిన్ల పై రొమాంటిక్ సాంగ్ చిత్రీకరణను పూర్తి చేసింది చిత్రబృందం. లేటెస్ట్ గా ఈ సినిమాకి ఓ ప్రత్యేక నెంబర్ ఉంటుందని, ఈరోజు షూటింగ్ ప్రారంభం కానుందని తెలిసింది.

urvashi-rautela_365

ఇటీవలే వాల్టేర్ వీరయ్య చిత్రంలో మెగాస్టార్ చిరంజీవితో డాన్స్ చేసి అబ్బురపరిచిన ఊర్వశి రౌటేలా, అఖిల్‌తో ఏజెంట్ సినిమాలో కూడా స్టెప్పులేసింది. ఈ పాటతో సినిమా చిత్రీకరణ మొత్తం ఓ కొలిక్కి రానుంది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ చిత్రంలో మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్ర పోషిస్తున్నారు. హిప్హాప్ తమిజా ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్. కాగా, ఏప్రిల్ 28వతేదీన థియేటర్లలో విడుదలఅవ్వనున్నది.

error: Content is protected !!