365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,వాషింగ్టన్, జనవరి 27,2023: సోమాలియాలో ఐఎస్ఐఎస్ నాయకుడు బిలాల్‌తో సహా 10 మంది ఉగ్రవాదులను అమెరికా మిలిటరీ హతమార్చింది, బిడెన్ పరిపాలనకు చెందిన ఇద్దరు సీనియర్ అధికారులు గురువారం ఈ సమాచారాన్ని ఇచ్చారు.
ఉత్తర సోమాలియాలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాది బిలాల్ అల్-సుడానీ , అతని10మంది సహచరులను అమెరికా దళాలు హతమార్చాయి. ఈ మిలిటరీ ఆపరేషన్‌కు ఈ వారం అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించిందని అధికారులు తెలిపారు.
బిడెన్ అడ్మినిస్ట్రేషన్‌లోని సీనియర్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు, ఉత్తర సోమాలియాలోని పర్వత గుహల సముదాయం నుంచి, బిలాల్ అల్-సుడానీ ఆఫ్రికా అంతటా ఐఎస్ఐఎస్ విస్తరణతోపాటు ఇతర కార్యకలాపాలను ప్లాన్ చేస్తున్నాడు.
అల్-సుడానీ హతమైనట్లు అమెరికా డిఫెన్స్ సెక్రటరీ లాయిడ్ ఆస్టిన్ గురువారం ఓ ప్రకటన ద్వారా ధృవీకరించారు.
జనవరి 25న, అధ్యక్షుడి ఆదేశాల మేరకుయూఎస్ దళాలు ఉత్తర సోమాలియాలో ఆపరేషన్ ప్రారంభించాయి. దీని ఫలితంగా బిలాల్ అల్-సుడానీతో సహా అనేక మంది ఇస్లామిక్ స్టేట్ సభ్యులు హతమయ్యారు.
ఆఫ్రికాలో ఐఎస్ఐఎస్ ఉనికిని పెంపొందించడానికి, ఆఫ్ఘనిస్తాన్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా గ్రూప్ కార్యకలాపాలకు నిధులు సమకూర్చడానికి అల్-సుడానీ బాధ్యత వహించాడు.
ఈ ఆపరేషన్‌లో పౌరులెవరూ గాయపడలేదని, అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ తెలిపారు.
ఈ విజయవంతమైన ఉగ్రవాద నిరోధక ఆపరేషన్‌లో వారి మద్దతు కోసం మా అసాధారణ సేవా సభ్యులతో పాటు మా గూఢచార సభ్యులు,ఇతర పరస్పర భాగస్వాములకు మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు.
యూఎస్ దళాలు అల్-సుడానీని పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. కానీ చివరికి అతను సైన్యం పై కాల్పులు జరుపగా ఎదురు కాల్పుల్లో మరణించాడు.