365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ముంబై,జనవరి 6,2024: దేశంలోని ప్రముఖ పెట్టుబడుల సంస్థ యూటీఐ మ్యుచువల్ ఫండ్ తమ కొత్త యూటీఐ క్వాంట్ ఫండ్ ను ఆవిష్కరించింది. ఇది మార్కెట్ పరిస్థితులను ముందుగానే అంచనా వేసే ప్రెడిక్టివ్ మోడలింగ్ పద్ధతిని పాటిస్తూ, యూటీఐకి ఉన్న విశేషమైన పెట్టుబడి పరిశోధన నైపుణ్యంతో రూపుదిద్దుకున్న యాక్టివ్ ఈక్విటీ ఫండ్. ఈ ఫండ్ ప్రధాన లక్ష్యం మార్కెట్ ఒడిదుడుకులను అధిగమిస్తూ సూచీల కంటే మెరుగైన రాబడులను అందించడమే.

ఈ ఫండ్‌కు సంబంధించిన ఎన్‌ఎఫ్‌వో (New Fund Offer) జనవరి 2, 2025న ప్రారంభమై జనవరి 16, 2025న ముగుస్తుంది.

యూటీఐ క్వాంట్ ఫండ్ ప్రత్యేకతలు:
ఈ ఫండ్ ‘ఫ్యాక్టర్ అలొకేషన్ మోడల్‌’ ద్వారా నాలుగు ప్రధాన అంశాలకు — మూమెంటం, నాణ్యత, లో వోలటైలిటీ, విలువ (Momentum, Quality, Low Volatility, Value) డైనమిక్‌గా వెయిటేజీని కేటాయిస్తుంది. మార్కెట్ హెచ్చుతగ్గులను సరిచేసే ఈ ఫ్యాక్టర్ మోడల్ సమతౌల్య రాబడులను అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

ఈ ఫండ్ మార్కెట్ చక్రాలు మారినప్పటికీ సులభంగా అనుగుణంగా మారగలదు. మార్కెట్ పరిస్థితులను గమనిస్తూ ఇన్వెస్టర్లకు రిస్క్‌ను తగ్గిస్తూ మెరుగైన రాబడులను పొందేందుకు తోడ్పడుతుంది. వివిధ పరిశోధనలతో నిర్వహించిన బ్యాక్ టెస్టింగ్‌లో ఈ ఫండ్ మంచి ఫలితాలను సాధించిందని కంపెనీ పేర్కొంది.

యూటీఐ ఏఎంసీ ముఖ్య వ్యాఖ్యలు:
UTI AMC చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ వెట్రి సుబ్రమణియం మాట్లాడుతూ,

“మార్కెట్‌లోని సంక్లిష్టతలను అధిగమించి ఇన్వెస్టర్లకు మంచి ఫలితాలు అందించడానికి క్రమబద్ధమైన,పరిశోధన ఆధారిత పెట్టుబడి విధానాన్ని అందించాలనే ఉద్దేశ్యంతో ఈ ఫండ్‌ను తీసుకువచ్చాము. మా ‘స్కోర్ ఆల్ఫా’ పెట్టుబడి ప్రక్రియతో పాటు ఫ్యాక్టర్ అలొకేషన్ మోడల్‌ తో ఈ ఫండ్‌ మరింత విశ్వసనీయంగా పనిచేస్తుంది. యూటీఐ మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్‌ ఈ ప్రక్రియను ఇప్పటికే విజయవంతంగా అమలు చేస్తోంది.”

అదేవిధంగా UTI AMC హెడ్ – ప్యాసివ్, ఆర్బిట్రేజ్ & క్వాంట్ స్ట్రాటెజీస్ శ్రీ శర్వన్ కుమార్ గోయల్ మాట్లాడుతూ,

“ఈ యూటీఐ క్వాంట్ ఫండ్ సాంప్రదాయ పెట్టుబడి పద్ధతులకు భిన్నంగా పనిచేస్తుంది. మార్కెట్ మార్పులను గమనిస్తూ, డైనమిక్ ఫండ్ అలొకేషన్ మోడల్‌ తో రిస్క్‌ను తగ్గించడంతో పాటు మెరుగైన అవకాశాలను అందిపుచ్చుకునేలా రూపొందించబడింది. వివిధ మార్కెట్ పరిస్థితుల వ్యాప్తంగా రాబడులు అందించగల ఫండ్‌గా ఇది ఇన్వెస్టర్లకు సురక్షితమైన ఆప్షన్‌గా ఉంటుంది” అని పేర్కొన్నారు.

ప్రధాన అంశాలు:
ఎన్‌ఎఫ్‌వో తేదీలు: జనవరి 2, 2025 నుంచి జనవరి 16, 2025 వరకు
ఫండ్ మేనేజర్: శ్రీ శర్వన్ కుమార్ గోయల్
పెట్టుబడి లక్ష్యం: క్వాంటిటేటివ్ థీమ్ ఆధారంగా ఈక్విటీ పరికరాలలో పెట్టుబడి పెట్టడం ద్వారా దీర్ఘకాలిక మూలధన వృద్ధిని సాధించడం
బెంచ్‌మార్క్: BSE 200 TRI
కనిష్ట పెట్టుబడి: ప్రాథమికంగా ₹1,000, ఆపై ₹1 గుణకాల్లో
పథకాలు: రెగ్యులర్ మరియు డైరెక్ట్ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. గ్రోత్ ఆప్షన్ మాత్రమే అందుబాటులో ఉంటుంది.


లోడ్ స్ట్రక్చర్: ఎంట్రీ లోడ్ లేదు. కానీ, 90 రోజుల్లోపు ఫండ్ రిడీమ్ చేసుకుంటే 1% ఎగ్జిట్ లోడ్ వర్తిస్తుంది. ఆ తర్వాత ఎగ్జిట్ లోడ్ ఉండదు.

ఉత్పత్తి లేబుల్ & రిస్కోమీటర్:యూటీఐ క్వాంట్ ఫండ్(క్వాంటిటేటివ్ పెట్టుబడి విధానాన్ని పాటించే ఓపెన్-ఎండెడ్ ఈక్విటీ స్కీము)

ఈ ఫండ్ వివిధ మార్కెట్ పరిస్థితుల్లో దీర్ఘకాలిక రాబడులను కోరుకునే ఇన్వెస్టర్లకు అనుకూలంగా ఉంటుంది.
“దయచేసి, పెట్టుబడికి ముందు మీ ఆర్థిక సలహాదారును సంప్రదించండి.”