
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, తిరుమల,ఆగస్టు 31,2021: శ్రీ కృష్ణజన్మాష్టమి వేడుకల్లో భాగంగా తిరుమలలో శ్రీవారి ఆలయంలో ఉట్లోత్సవ ఆస్థానం మంగళవారం సాయంత్రం 4నుంచి 6 గంటల వరకు శాస్త్రోక్తంగా జరిగింది. కోవిడ్ – 19 వ్యాప్తి నేపథ్యంలో ఈ వేడుకలు ఆలయంలో ఏకాంతంగా నిర్వహించారు.

శ్రీవేంకటేశ్వరస్వామివారికి గోకులాష్టమి ఆస్థానం నిర్వహించిన మరునాడు ఉట్లోత్సవాన్ని (శిక్యోత్సవం) నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులోభాగంగా శ్రీ మలయప్పస్వామివారిని బంగారు తిరుచ్చిపై ప్రసాదాలు తయారు చేసే పోటు లోనికి, శ్రీ కృష్ణస్వామివారిని మరో తిరుచ్చిపై పోటు మండపంలోని కి వేంచేపు చేసి నివేదన, హారతి ఇచ్చారు.

అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో స్వామివార్లను వేంచేపు చేసి ఆస్థానం, నివేదన, హారతి సమర్పించారు.
