365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,అమరావతి ,అక్టోబర్ 22,2022: కోనసీమ తిరుపతిగా ప్రసిద్ధి గాంచిన అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. తిరుమల తిరుపతి దేవస్థానం మాదిరిగానే ఈ వాడపల్లి వెంకటేశ్వర స్వామికి బ్రహ్మోత్సవ వేడుకలను ప్రతి ఏటా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. పదవ బ్రహ్మోత్సవాల వేడుకలలో స్వామి వారిని లక్షలాదిమందిభక్తులు తరలి వచ్చారు.

అక్టోబర్14 నుంచి ప్రారంభమైన బ్రహ్మోత్సవాలుశనివారంతో ముగిశాయి. ఈ సందర్భంగా ముఖ్యంగా ఆలయ ప్రాంగణంలో వివిధ రకాల పూలతో రూపొందించిన అలంకరణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కొత్తపేట ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి స్వామి ఆద్వర్యంలో ఆలయ కమిటీ నిర్వహించిన ఈ బ్రహ్మోత్సవాలకు జిల్లా, రాష్ట్ర స్థాయి ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు విచ్చేసి స్వామి వారిని దర్శించుకున్నారు.