

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్ ,తిరుపతి,జూన్ 23,2022: తిరుపతి సమీపంలోని పాత కాల్వ వద్ద ( పేరూరు బండపై ) నిర్మించిన శ్రీ వకుళమాత ఆలయంలో గురువారం ఉదయం శాస్త్రోక్తంగా మహా సంప్రోక్షణ నిర్వహించారు.


ఉదయం 5.30 నుంచి 7.30 గంటల వరకు కుంభారాధన, నివేదన, హోమం, మహాపూర్ణాహుతి, విమాన గోపుర కలశ ఆవాహన నిర్వహించారు. ఉదయం 7.30 నుంచి 8.45 గంటల వరకు కటక లగ్నంలో ప్రాణ ప్రతిష్ట, మహాసంప్రోక్షణ శాస్త్రోక్తంగా నిర్వహించారు. తరువాత అక్షతారోహణం, అర్చక బహుమానం అందించారు. మధ్యాహ్నం నుండి భక్తులకు సర్వదర్శనం కల్పించారు