365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఖమ్మం, ఫిబ్రవరి 19 2023:జనవరి15న సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య ప్రవేశపెట్టిన భారతీయ రైల్వే ప్రతిష్టాత్మక రైలు వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు ఖమ్మం ప్రయాణికుల నుంచి విశేష స్పందన లభించిందని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.
వరంగల్, విజయవాడ, రాజమండ్రిలతో పాటు ఖమ్మంస్టేషన్లలో ఆగుతున్నఈ రైలుకు ఆదరణ చాలా మంచి రెస్పాన్స్ ఉందని దక్షిణమధ్యరైల్వే ఓ ప్రకటన ద్వారా తెలిపింది.
గత నెల రోజుల వ్యవధిలో ఖమ్మం నుంచి వరంగల్, సికింద్రాబాద్‌లకు 1,182 మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు. మరో 2,768 మంది ప్రయాణికులు విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం వైపు ప్రయాణించారు.
మరోవైపు విశాఖపట్నం నుంచి ఖమ్మంకు 1,274 మంది, సికింద్రాబాద్ నుంచి ఖమ్మంకు మరో 1,806 మంది ప్రయాణికులు ప్రయాణించారు.
గణాంకాల ప్రకారం, ఖమ్మం రైల్వే స్టేషన్ నుంచి ప్రతిరోజూ సగటున 95 మంది వ్యక్తులు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఎక్కగా… మరో 106 మంది ప్రయాణికులు ఖమ్మం స్టేషన్‌లో ప్రతిరోజూ రైలు దిగారు.
ఖమ్మం నుంచి రైలు ప్రయాణీకులు కూడా ఈ సెమీ-హై స్పీడ్ రైలులో ప్రయాణించడానికి ఆసక్తిని కనబరుస్తున్నారని, ప్రయాణీకుల నుంచి అందిన ఫీడ్‌బ్యాక్ చాలా సంతృప్తికరంగా ఉందని ప్రకటనలో పేర్కొంది ఎస్సీ ఆర్.