Sat. Jul 20th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, జూన్ 24,2024:రాజస్థాన్‌లోని 412.5 MWp/335 MW AC ప్రాజెక్టుకు బైఫేషియల్ సోలార్ మాడ్యూల్స్‌ను సరఫరా చేసేందుకు  యాక్సియోనా ఎనర్జీ (ACCIONA Energy) అనుబంధ సంస్థ జూనా రెన్యూవబుల్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ (Juna Renewable Energy Private Limited) నుంచి వారీ ఎనర్జీస్‌కు భారీ కాంట్రాక్టు లభించింది. 

ఈ ప్రాజెక్టు 2025 మార్చిలో అందుబాటులోకి వస్తుంది. 2023 జూన్ 30 నాటికి సోలార్ పీవీ మాడ్యూల్స్ ఉత్పత్తికి సంబంధించి అత్యధికంగా 12 GW స్థాపిత సామర్ధ్యంతో వారీ ఎనర్జీస్ భారత్‌లో అతి పెద్ద తయారీ సంస్థగా ఉంది (మూలం: క్రిసిల్ రిపోర్ట్).

బికానీర్ జిల్లా కవానీ గ్రామంలో ఈ ప్రాజెక్టు ఉంది. ఈ యుటిలిటీ-స్కేల్ సోలార్ ప్లాంటులో ఒక్కోటి 540-545 Wp సామర్థ్యం ఉండే వారీ P-రకం బైఫేషియల్ మాడ్యూల్స్‌ను ఏర్పాటు చేయనున్నారు.

ఈ మాడ్యూల్స్, హారిజాంటల్ సింగిల్-యాక్సిస్ ట్రాకర్లపై ఇన్‌స్టాల్ చేశాయి. కాంతిని మెరుగ్గా శోషించుకోవడం ద్వారా మరింత అధికంగా శక్తిని ఉత్పత్తి చేసేందుకు, ట్రాకింగ్ సామర్ధ్యాలను మరింత మెరుగుపర్చేందుకు ఇవి ఉపయోగపడగలవు.

“రాజస్థాన్‌లోని ఈ ప్రాజెక్టు కోసం మేము ఎంపిక కావడం మాకు గర్వకారణం. వారీ సాంకేతికప్రాజెక్టుల అమలు సామర్ధ్యాలపై గల నమ్మకంధీమాకు ఈ భాగస్వామ్యం నిదర్శనంగా ఉండగలదు.

భారత్‌లో సోలార్ ప్రాజెక్టులకు మాడ్యూల్స్‌ను అందించే దిగ్గజ తయారీ సంస్థల్లో ఒకటిగా మా స్థానాన్ని ఈ ప్రాజెక్టు మరింత పటిష్టం చేయగలదు. అలాగేఆ ప్రాంతంలో ఉద్యోగావకాశాలుఆర్థిక వృద్ధికి తోడ్పడేందుకు ఇటువంటివి ఉపయోగపడగలవు అని వారీ ఎనర్జీస్ లిమిటెడ్ డైరెక్టర్ శ్రీ సునీల్ రాఠీ తెలిపారు.

“వారీ ఎనర్జీస్ లిమిటెడ్‌తో భాగస్వామ్యం కుదుర్చుకోవడం మాకు గర్వకారణం. అత్యుత్తమ సోలార్ సొల్యూషన్స్‌ను అందించడంలో వారు ఎంతో నిబద్ధతతో కృషి చేయడమనేదిపర్యావరణహిత ఇంధన కార్యక్రమాలను ప్రోత్సహించాలన్న మా విధానానికి అనుగుణమైనదిగా ఉంది.

భారత్‌లో పునరుత్పాదక ఇంధన భవిష్యత్‌ను తీర్చిదిద్దడంకమ్యూనిటీలకు సాధికారత కల్పించడంకర్బన ఉద్గారాలను తగ్గించడం వంటి అంశాల దిశగా ఇరు సంస్థలు కలిసి పని చేస్తాయి అని భారత్‌లో యాక్సియోనా ఎనర్జీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ రాధాకృష్ణన్ రామచంద్రన్ తెలిపారు.

Also read :Waaree Energies Limited Secures Major Module Supply Contract for Acciona Energy’s subsidiary Juna Renewable’s 412.5 MWp Project in Rajasthan

ఇది కూడా చదవండి:‘ఐమొబైల్ పే’లో విశిష్ట భద్రత ఫీచర్ ‘స్మార్ట్‌లాక్’ను ప్రవేశపెట్టిన ఐసీఐసీఐ బ్యాంక్

Also read :ICICI Bank introduces ‘SmartLock’, a unique safety measure on iMobile Pay

Also read :Birla Opus’s Interactive Expo Reaches Hyderabad

ఇది కూడా చదవండి:హుస్నాబాద్ లో ఇవాళ మెగా జాబ్ మేళా..

Also read :Terrorist attack in Russia 22 people including police killed

Also read :Getting enough vitamin C is required for beautiful skin; add these items in your everyday diet.

ఇది కూడా చదవండి:రష్యాలో ఉగ్రవాదుల దాడి పోలీసులతో సహా 16 మంది మృతి,6మంది ఉగ్రవాదులు హతం..

ఇది కూడా చదవండి:జియో సరి కొత్త ప్లాన్‌లో ఫ్రీ OTT తో పాటు 84 రోజులు రీఛార్జ్..