365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,అక్టోబర్ 13, 2025: నటుడు వరుణ్ సందేశ్ హీరోగా నటించిన తెలుగు చిత్రం ‘కానిస్టేబుల్’ ఇటీవల థియేటర్లలో విడుదలై, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌గా మంచి టాక్ సొంతం చేసుకుని విజయవంతంగా రన్ అవుతోంది.
ఈ చిత్రం ప్రధాన అంశం పూర్తిగా కొత్తగా ఉంది. ఇటీవల వస్తున్న రొటీన్ మర్డర్ క్రైమ్ థ్రిల్లర్లకు కొంచెం భిన్నంగా ట్రై చేసి, ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. దానికి తగ్గట్ట సాగే కొన్ని సన్నివేశాలు చాలా బాగున్నాయి, కొత్తగా అనిపించాయి. మర్డర్ మిస్టరీని మెయింటైన్ చేసిన సస్పెన్స్ ఎలిమెంట్ అద్భుతంగా పని చేసింది. అలాగే, కొన్ని ట్విస్ట్‌లు పూర్తిగా పేలి, ప్రేక్షకులను ఆకర్షించాయి.
హీరో వరుణ్ సందేశ్ చాలా కాలం తర్వాత ఒక్కొక్క రేంజ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. వరుణ్ సందేశ్ అంటే సాధారణంగా లవ్ స్టోరీలే గుర్తుకు వస్తాయి కానీ, ఈసారి ఏ క్యారెక్టర్ అయినా చేయగలనని నిరూపించాడు.

యాక్షన్ సీన్స్‌లో కూడా చాలా నేచురల్‌గా చేశాడు. అతనితో పాటు హీరోయిన్ మధులికా సినిమాలో మంచి ప్రదర్శన ఇచ్చింది. వీరితో పాటు సెకండ్ హీరోయిన్ భవ్యశ్రీ సాలిడ్ పెర్ఫార్మెన్స్ చూపించింది. తన రోల్‌లోని అన్ని షేడ్స్‌ను చక్కగా ఎస్టాబ్లిష్ చేసి, ఆ క్యారెక్టర్‌కు ప్రాణం పోసింది.
ఈ సినిమాలో నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి. నిర్మాత బలగం జగదీష్ ఎక్కడా రాజీపడకుండా, ఖర్చులకు వెనక్కాకుండా క్వాలిటీ సినిమాను రిచ్‌గా తెరకెక్కించారు. సంగీతం కూడా సినిమాకు మరో అదనపు ఆకర్షణగా నిలిచింది.
దర్శకుడు ఆర్యన్ సుభాన్ ఎస్కే పని పూర్తి స్థాయిలో ప్రేక్షకులను మెప్పించింది. తీసుకున్న కథ-కథనాలు అలరిస్తాయి, ప్రేక్షకులను ఆకట్టుకునేలా తెలిపాయి.