365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, అక్టోబర్ 23,2024 : వైసీపీకి భారీ షాక్.. ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకురాలు వాసిరెడ్డి పద్మ వైసీపీకి గుడ్ బై చెప్పింది. పార్టీలో కష్టపడిన నాయకులు, కార్యకర్తలు కోసం జగన్ మోహన్ రెడ్డి గారు ‘గుడ్ బుక్’ అనే ప్రవర్తనను ప్రారంభించారు. కానీ, నాయకులు, కార్యకర్తల కోసం అవసరం ‘గుడ్ బుక్’ కాదు, “గుండె బుక్” అని ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
పార్టీని నడిపించడంలో జగన్ కు బాధ్యత లేదు. పరిపాలన చేయడంలో బాధ్యత లేదు. సమాజం పట్ల అంతకన్నా బాధ్యత లేదు” అని ఆమె తెలిపారు.
జగన్ గారు రాజకీయ పార్టీని వ్యాపార సంస్థగా భావించి, తమ జీవితాలు, ప్రాణాలు పెట్టిన కార్యకర్తల కష్టాన్ని గుర్తించడంలేదని ఆమె విమర్శించారు. ఈ ఎన్నికల తీర్పు, ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా, అప్రజాస్వామిక పద్ధతులను గమనించడం, నియంతృత్వ ధోరణి ఉన్న నాయకుని మెచ్చుకోరు అని ఆమె స్పష్టం చేశారు.
ప్రజా తీర్పు తర్వాత, అనేక విషయాలను పునఃసమీక్షించి, అంతర్మథనం తర్వాతే వైయసీఆర్ సీపీని వీడాలని నిర్ణయించుకున్నాను” అని వాసిరెడ్డి పద్మ వెల్లడించారు.