365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,జనవరి 28,2022:వేదాంత్ ఫ్యాషన్స్ లిమిటెడ్ తమ తొలి పబ్లిక్ ఆఫరింగ్ (ఆఫర్)ను ఫిబ్రవరి 4,2022న తెరువనుంది.యాంకర్ ఇన్వెస్టర్లకు ఒక రోజు ముందుగా అంటే ఫిబ్రవరి3,2022న ఈ ఆఫర్ తెరువనున్నారు.ఈ ఆఫర్ ప్రైస్ బ్యాండ్‌ను ఒక రూపాయి ముఖ విలువ కలిగిన షేర్‌కు 824 రూపాయల నుంచి 866 రూపాయల నడుమ స్థిరీకరించారు.
కనీసం 17 ఈక్విటీ షేర్లతో తమ బిడ్స్‌ను దాఖలు చేయాల్సి ఉంటుంది.ఈ ఆఫర్‌లో భాగంగా 36,364,838 ఈక్విటీ షేర్లను విక్రయానికి అందుబాటులో ఉంచారు. వీటిలో 17,459,392 ఈక్విటీ షేర్లు రైన్ హోల్డింగ్స్ లిమిటెడ్‌కు చెందగా, 7,23,014 షేర్లను కేదారా క్యాపిటల్ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ –కేదార క్యాపిటల్ ఏఐఎఫ్ –1 , 18,182,432 ఈక్విటీ షేర్లను రవి మోదీ ఫ్యామిలీ ట్రస్ట్ కలిగి ఉన్నాయి. ఈ ఆఫర్‌లో భాగంగా అందుబాటులో ఉంచిన షేర్లను బీఎస్‌ఈ ,ఎన్‌ఎస్‌ఈలలో లిస్ట్ చేయడానికి ప్రతిపాదించారు.