velpuri_srinivasarao

365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,డిసెంబర్17,2022: భారత న్యాయ వ్యవస్థలో ఉన్న అనేక లోపాలను సరిదిద్ది, సంపూర్ణ న్యాయవ్యవస్థ ను ఏర్పాటు చేయాలని సౌత్ ఇండియా కాపు అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ వేల్పురి శ్రీనివాసరావు పీఎం నరేంద్రమోదీ కి రాసిన లేఖ ద్వారా విజ్ఞప్తి చేసారు.

న్యాయ వ్యవస్థలో లోపాల వలన 36 కేసులలో ముద్దాయిగా ఉన్న ఆర్ధిక ఉగ్రవాది జగన్ 10 సంవత్సరాల నుంచి బెయిల్ పై ఉన్నారు అని, అదే సామాన్యుడికి 10 సంవత్సరాలు బెయిల్ ఇవ్వడం లేదని వేల్పురి లేఖలో ఆరోపించారు.

velpuri_srinivasarao

సామాన్యుడికి ఒక న్యాయం ముఖ్యమంత్రికి ఒక న్యాయం సరికాదని, దేశంలోని ప్రజలందరికి ఒకే న్యాయం ఉండే విధంగా న్యాయ వ్యవస్థ ఉండాలని, సుప్రీంకోర్టు నుంచి అన్ని కోర్టులలో 50 శాతం న్యాయ మూర్తులను మహిళలను నియమించాలని పీఎం మోదీ కి శ్రీనివాస్ విజ్ఞప్తి చేసారు.

దేశంలో న్యాయ మూర్తుల కొరత కారణంగా ఆర్ధిక ఉగ్రవాదులు, దొంగలు, దోపిడీ దారులు, క్రిమినల్స్ రెచ్చిపోయే ప్రమాదం ఉందని, కోర్ట్ లలో కేసులు పరిష్కారం వెంటనే పూర్తి చేయాలని, కొన్ని కేసులు 50 సంవాత్సరాలు నుంచి కోర్టులలో పెండింగ్ లో ఉన్నాయని వేల్పురి ఆందోళన వ్యక్తంచేశారు.

దేశంలోని కోర్టులలో వందల సంఖ్యలో కాళిగా ఉన్న న్యాయమూర్తుల నియామకాలను వెంటనే చేపట్టి, పేద ప్రజలకు సత్వర న్యాయం చేయాలని వేల్పురి శ్రీనివాస్ కోరారు.