365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, సెప్టెంబర్ 12,2024: దిగ్గజ టెలికం ఆపరేటరు వి (Vi) తమ రిటైల్ స్టోర్స్,పేమెంట్ చానల్స్‌కు పేమెంట్ కార్డ్ ఇండస్ట్రీ-డేటా సెక్యూరిటీ స్టాండర్డ్ వెర్షన్ 4.0 (PCI DSS 4.0) సర్టిఫికేషన్ పొందినట్లు వెల్లడించింది.
భారత్‌లో ఈ ప్రతిష్టాత్మక సర్టిఫికేషన్ పొందిన తొలి టెలికం ఆపరేటరుగా వి (Vi) నిల్చింది. అత్యుత్తమ గ్లోబల్ సెక్యూరిటీ ప్రమాణాలకు కట్టుబడి ఉంటూ కస్టమర్ పేమెంట్ సమాచారాన్ని పరిరక్షించడంలో వి (Vi)కి గల నిబద్ధతకు ఇది నిదర్శనం.
PCI DSS 4.0ని పేమెంట్ కార్డ్ ఇండస్ట్రీ సెక్యూరిటీ స్టాండర్డ్స్ కౌన్సిల్ (PCI SSC) ప్రారంభించింది. డేటా ఉల్లంఘనలు, మోసాల నుంచి క్రెడిట్, డెబిట్ కార్డ్ లావాదేవీలను సురక్షితంగా హ్యాండిల్ చేసేందుకు సంస్థలు పాటించే అత్యంత కఠినతరమైన, అప్-టు-డేట్ సెక్యూరిటీ ప్రొటోకాల్స్‌ను ఇది సూచిస్తుంది.
భారత్‌లోని బ్యాంకింగ్, ఆర్థిక సంస్థలు తప్పనిసరిగా PCI DSS 4.0 సర్టిఫికేషన్ పొందాలని ఇప్పటికే ఆర్‌బీఐ మార్గదర్శకాల్లో నిర్దేశించబడింది. ఈ సర్టిఫికేషన్ పొందిన తొలి టెలికం సంస్థగా వి (Vi) నిలవడమనేది టెలికం రంగంలో ఒక కీలక మలుపు కాగలదు. కస్టమరు నమ్మకాన్ని పెంపొందించడంతో పాటు విశ్వసనీయతను, కస్టమర్ లాయల్టీని పెంచుకోవడంలో ఈ సర్టిఫికేషన్ కీలక పాత్ర పోషిస్తుంది.
“కస్టమర్ల డేటాను సురక్షితంగా ఉంచడాన్ని వి (Vi) అత్యంత ప్రాధాన్యతాంశంగా పరిగణిస్తుంది. ఇందుకు కట్టుబడి ఉంటుంది. PCI DSS 4.0 సర్టిఫికేషన్ పొందడమనేది అత్యుత్తమ భద్రతా చర్యలను పాటించడంలో మాకున్న నిబద్ధతను తెలియజేస్తుంది.
భారత్‌లో ఈ సర్టిఫికేషన్ పొందిన తొలి టెలికం సంస్థగా నిలవడం మాకెంతో సంతోషకరమైన విషయం. పరిశ్రమలో కొత్త ప్రమాణాలను నెలకొల్పేందుకు, అధునాతన సెక్యూరిటీ టెక్నాలజీలపై ఇన్వెస్ట్ చేసేందుకు మేము కట్టుబడి ఉన్నాం” అని వి (Vi) సీటీవో జగ్‌బీర్ సింగ్ తెలిపారు.
ఈ సర్టిఫికేషన్ పొందేందుకు వి (Vi) ప్రముఖ సెక్యూరిటీ కన్సల్టింగ్ సంస్థ విస్టా ఇన్ఫోసెక్‌తో కలిసి పని చేసింది. “PCI DSS 4.0 సర్టిఫికేషన్‌కి సంబంధించి వి (Vi)తో కలిసి పని చేయడం ఒక విశిష్టమైన అనుభవం.
పరిశ్రమలోనే మొట్టమొదటిసారిగా ఈ మైలురాయిని సాధించడంలో వారికి గల నిబద్ధత, మేనేజ్‌మెంటు అందించిన మద్దతు, అంకిత భావంతో పని చేసే టీమ్ మొదలైనవి కస్టమర్ చెల్లింపులకు భద్రత కల్పించడంపై వారు ఎంతగా దృష్టి పెడతారనేది తెలియజేస్తుంది” అని విస్టా ఇన్ఫోసెక్ వ్యవస్థాపకుడు & డైరెక్టర్ నరేంద్ర సాహూ తెలిపారు.
ఈ ఏడాది తొలినాళ్లలో భారత్‌లోనే తొలిసారిగా SOC2 టైప్ II అటెస్టేషన్‌ను పొందిన టెలికం ఆపరేటరుగా వి (Vi) నిలవడమనేది డేటా సెక్యూరిటీ విషయంలో కంపెనీకి ఉన్న నిబద్ధతను తెలియజేస్తుంది.
PCI DSS 4.0 సర్టిఫికేషన్ కూడా సాధించడం ద్వారా, కస్టమర్ల డేటాకు భద్రత కల్పించడంపై అలాగే పరిశ్రమలో అత్యుత్తమ సెక్యురిటీ విధానాల్లో సరికొత్త ప్రమాణాలను నెలకొల్పడంపై ప్రధానంగా దృష్టి పెడుతూ, టెలికం రంగంలో వి (Vi) తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకోవడాన్ని కొనసాగిస్తుంది.