365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,ఢిల్లీ,జనవరి2,2022: కొచ్చిలోని కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ (సిఎస్‌ఎల్)లో నిర్మిస్తున్న స్వదేశీ విమాన వాహక నౌక (INS Vikrant) విక్రాంత్‌ను ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు ఆదివారం సందర్శించారు. CSL ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ MD, మధు ఎస్ నాయర్, యార్డ్ సామర్థ్యాలు,బలాలు ,స్వదేశీ సాంకేతికతలను అభివృద్ధి చేయడంలో ప్రపంచ స్థాయి సామర్థ్యాలను రూపొందించడంలో దాని సహకారం గురించి సమాచారాన్ని అందించారు. ఉపరాష్ట్రపతి నౌకలోని హ్యాంగర్ డెక్,ఫ్లైట్ డెక్‌ను కూడా సందర్శించారు.

ఈసందర్భంగా ఆయన వెంట కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి పి రాజీవ్,సదరన్ నావల్ కమాండ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ రియర్ అడ్మిరల్ ఆంటోనీ జార్జ్, భార్య ఉష, ఇతర కుటుంబ సభ్యులు ఉన్నారు. భారత నావికాదళం గార్డ్ ఆఫ్ హానర్‌ను కూడా ఉపరాష్ట్రపతి పరిశీలించారు. సోమవారం కొచ్చి, కొట్టాయంలో జరిగే కొన్ని కార్యక్రమాలకు హాజరైన ఆయన జనవరి 4న తిరిగి ఢిల్లీకి చేరుకుంటారు. డిసెంబర్ 31న కేరళ చేరుకున్నవెంకయ్య నాయుడు అదే రోజు లక్షద్వీప్‌కు వెళ్లారు. కద్మత్,ఆండ్రోత్ దీవులలో రెండు ఆర్ట్స్ & సైన్సెస్ కళాశాలల ప్రారంభోత్సవంతో పాటు గత రెండు రోజులుగా ద్వీపంలోని వివిధ కార్యక్రమాలకు ఆయన హాజరయ్యారు.