Vijayawada is leading in Online Medical Crowdfunding 2.5 Cr raised through 14000 generous donorsVijayawada is leading in Online Medical Crowdfunding 2.5 Cr raised through 14000 generous donors

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,విజయవాడ,జనవరి16,2021:ఆర్ధికావసరాలు అవరోధంగా మారినప్పుడు  వైద్యసంరక్షణ వంటి ప్రాధమిక అవసరాలు కూడా  ఓ కుటుంబానికి అత్యంత కష్టసాధ్యంగా మారుతుంటాయి. ఈ తరహా అత్యవసర పరిస్థితులలో, తాము సంపాదించిన మొత్తం, పొదుపు మొత్తాలను కూడా జబ్బు బారిన పడిన తమ కుటుంబ సభ్యులు కోలుకోవడానికి, వారికి మెరుగైన ఆరోగ్యం అందించడానికి ఖర్చు చేస్తుంటారు. దక్షిణాసియాలో అతిపెద్ద క్రౌఢ్‌ ఫండింగ్‌ వేదిక, మిలాప్‌ ఇప్పుడు విజయవాడలో ఎన్నో కుటుంబాలకు వైద్య,అత్యవసర సంఘటనల వేళ సహాయమందించింది. తెలుగు రాష్ట్రాలలో టియర్‌ 2 నగరాలను తీసుకుంటే, మెడికల్‌ క్రౌడ్‌ఫండింగ్‌ పరంగా విజయవాడ నగరం అగ్రస్ధానంలో ఉంది.అనోజ్‌ విశ్వనాథన్‌, అధ్యక్షుడు, కో–ఫౌండర్‌ –మిలాప్‌ మాట్లాడుతూ  ‘‘ఒక్క విజయవాడలోనే 2.5కోట్ల రూపాయలకు పైగా మేము సమీకరించాము. దాదాపు 14వేల మంది దాతలు, 1000 పైగా క్యాంపెయిన్‌లకు తోడ్పాటునందించారు. వైద్య అవసరాలకు క్రౌడ్‌ ఫండింగ్ ఆవశ్యకత పరంగా స్పష్టమైన వృద్ధి కనిపిస్తుంది. విజయవాడ నుంచి ఏర్పాటుచేస్తోన్న ఫండ్‌ రైజర్లలో దాదాపు 75%  ఫండ్‌రైజర్లు వైద్య పరమైన అవసరాలకే ఉంటున్నప్పటికీ, ఈ నగరం నుంచి సమీకరించిన 2.5 కోట్ల రూపాయల నిధులలో దాదాపు 95% ఈ కారణాల కోసమే ఉన్నాయి.

ప్రియదర్శినికి చెందిన శిశువు నెలలు నిండకుండానే జన్మించడంతో ఆ శిశువును ఎన్‌ఐసీయు కేర్‌లో ఉంచారు. శిశువు తండ్రి శివరామ్‌ ఓ క్రౌడ్‌ ఫండింగ్‌ క్యాంపెయిన్‌ ఆరంభించారు. తద్వారా విజయవాడ నగరంలో సుదీర్ఘకాలం పాటు ఆ శిశువుకు చికిత్సనందించాలనుకున్నారు. అప్పటికే ఆయన 11 లక్షల రూపాయలను ఖర్చు చేశారు. తన దగ్గర ఉన్న పొదుపు మొత్తం కరిగి పోయింది. మిలాప్‌పై చేసిన ఈ క్యాంపెయిన్‌ ద్వారా ఆయన 350 మంది మద్దతుదారుల సహకారంతో దాదాపు 20 లక్షల రూపాయలను సమీకరించారు.దీని విజయం గురించి, ఫండ్‌రైజర్ల కోసం మిలాప్‌ ,క్యాంపెయిన్‌ మేనేజర్‌ యోగేష్‌ మాట్లాడుతూ ‘‘ఓ ప్రైవేట్‌ బ్యాంక్‌లో మేనేజర్‌గా శివరామ్‌ పనిచేస్తున్నారు. ఆయన ఈ క్యాంపెయిన్‌ను మూడు ఇతర శాఖల వద్ద కూడా పంచుకున్నారు. ఆయనకు యుఎస్‌లో అతి సన్నిహిత మిత్రులు కూడా ఉన్నారు. వారు ఈ లక్ష్యిత మొత్తం చేరుకోవడంలో సహాయపడ్డారు’’ అని అన్నారు.

ఇదే రీతిలో ఆదిత్య. అనూషకు జన్మించిన శిశువు కోసం ఓ ఫండ్‌ రైజింగ్‌ కార్యక్రమం ప్రారంభించారు. తమ కుమారునికి పుట్టుకతోనే సమస్యలు రావడంతో ఆయన ఈ ఫండ్‌ రైజింగ్‌ ప్రారంభించారు. అప్పటికే ఆయన 2.7 లక్షల రూపాయను ఖర్చు చేయడం వల్ల పొదుపు మొత్తం కరిగిపోయింది. ఇక చికిత్స పరంగా ముందుకు వెళ్లే అవకాశాలు ఎంత మాత్రం లేవనుకుంటున్న వేళ ఆయన బంధువులలో ఒకరు ఫండ్‌ రైజింగ్‌ ప్రారంభించమని సలహా ఇచ్చారు.ఆదిత్య మాట్లాడుతూ ‘‘దాదాపు 20 రోజుల లోపుగానే నేను మూడు లక్షల రూపాయలను దాదాపు 300 మంది దాతల నుంచి పొందాను.  ఈ క్యాంపెయిన్‌ మేనేజర్‌ నాకు ఏ విధంగా నిధులను సమీకరించాలో తెలిపారు. సోషల్‌మీడియా,  బంధువులు, స్నేహితులకు ఈ సందేశాలను పంపాలో కూడా తెలిపారు. విత్‌డ్రాయల్‌ ప్రక్రియ కూడా చాలా సులభం. ఆస్పత్రి బిల్లులను సకాలంలో  చెల్లించేందుకు ఈ ప్రక్రియ నాకు తోడ్పడింది..’’ అని అన్నారు.మిలాప్‌, క్రౌడ్‌ఫండింగ్‌ ప్లాట్‌ఫామ్‌ ప్రధానంగా వ్యక్తిగత వైద్య కారణాల కోసం ఉద్దేశించబడినది. ఇప్పటి వరకూ దాదాపు 1200 కోట్ల రూపాయలను 4.2 లక్షల మంది దాతల నుంచి ఆరోగ్యం,  అత్యవసరం,  విద్య,  చారిటీ మొదలైన కారణాల కోసం సమీకరించింది. ఈ వేదిక ప్రధానంగా వైద్యపరమైన కారణాలు, అత్యవసరాలకు తోడ్పడుతున్నా, విభిన్నమైన కారణాల కోసం కూడా నిధుల సమీకరణకు ఇది తోడ్పడుతుంది.

ఉదాహరణకు, సుదీక్షణ్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకురాలు సీ.విమల, రోడ్డు ప్రమాద బాధితులకు సహాయమందించడానికి ఓ  ఫండ్‌రైజింగ్‌ కార్యక్రమం ప్రారంభించారు. సుదీక్షణ్‌ ఫౌండేషన్,‌ ప్రాజెక్ట్‌లలో ఒకటి ఏమిటంటే, చిన్నారులు,యువతను గుర్తించి, కృత్రిమ అవయవాలను అందించడం. గత 13 సంవత్సరాలుగా అంటే 2007వ సంవత్సరం నుంచి ఈ ఫౌండేషన్‌ ఇప్పటి వరకూ 6500 మందికి కాళ్లు, చేతులు, మోటరైజ్డ్‌ వీల్‌ చైర్స్‌ వంటివి అందించింది. ఈ సంస్థ నుంచి సహాయం పొందిన ఎంతోమంది చిన్నారులు తమ విద్యపూర్తి చేసుకోవడంతో పాటుగా తమ కలలనూ సాకారం చేసుకున్నారు.మొబైల్‌ ఫోన్ల కోసం వెబ్‌ అప్లికేషన్‌ కోవిడ్‌ వైర్‌ (జ్ట్టిఞట://ఛిౌఠిజీఛీఠీజీట్ఛ.జీుఽ). విజయవాడ నగరానికి చెందిన సరిగమ,గౌతమ్‌ ప్రారంభించిన మీడియా కార్యక్రమమిది. దీనిద్వారా ఆధీకృత కోవిడ్‌–19 సంబంధిత సమాచారం ఎంపిక చేయడంతో పాటుగా దానికి సంబంధించిన అనువాదాలనూ అందిస్తుంది. ఈ ద్వయం ఆన్‌లైన్‌ క్రౌడ్‌ఫండింగ్‌ క్యాంపెయిన్‌ ఆరంభించడం ద్వారా ఈ అప్లికేషన్‌ నిర్వహణకయ్యే ఖర్చులను పొందగలిగారు. ‘మహమ్మారి గురించి పలు మార్గాల ద్వారా అపారమైన సమాచారం అందుబాటులోకి వచ్చింది. కొన్ని అంశాల విశ్వసనీయత కూడా ప్రశ్నార్థకంగా మారింది. అదే మమ్మల్ని ధృవీకరించిన సమాచారం మాత్రమే అందించే ఏకైక వేదిక రూపకల్పన చేసేలా పురికొల్పింది. ఈ సమాచారం సంక్షిప్తంగా ఉంటూనే చదువతగిన రీతిలో ఉండాలనుకున్నాం.అంతేకాదు , సంచలనాత్మకంగా లేదా ఎరవేసే రీతిలోనూ ఉండకూడదనుకున్నాం’’ అని సరిగమ అన్నారు. భారతదేశంలో పలు కారణాల కోసమే ఈ వేదిక తమ మద్దతునందించినా, ఫండ్‌ రైజర్లు మాత్రం అంతర్జాతీయంగా ఎక్కడి నుంచైనా సహాయం పొందే అవకాశం మాత్రం ఉంది.