365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, మార్చి 20,2025: తమిళ స్టార్ హీరో విజయ్, మీనాక్షి చౌదరి జంటగా నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ GOAT (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్) వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఈ సినిమా మార్చి 23, ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు జీ తెలుగులో ప్రసారమవుతుంది.

సి డుకాటి 2025 స్క్రాంబ్లర్ ఐకాన్ డార్క్ లాంచ్..

తాజా సినిమాలతో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న జీ తెలుగు, థియేటర్లలో ఘన విజయం సాధించిన ఈ యాక్షన్ థ్రిల్లర్‌ను ప్రదర్శించనుంది. వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని AGS ఎంటర్టైన్‌మెంట్స్ నిర్మించగా, యువన్ శంకర్ రాజా సంగీతం అందించాడు.

గాంధీ (విజయ్) స్పెషల్ యాంటీ-టెర్రరిస్ట్ స్క్వాడ్ (SATS) సభ్యుడు. మోహన్ నేతృత్వంలో కెన్యాలో జరిగిన ఓ మిషన్‌ను విజయవంతంగా పూర్తి చేస్తాడు. అయితే కొన్ని సంవత్సరాల తర్వాత బ్యాంకాక్‌లో ఓ ఆపరేషన్‌ సమయంలో తన కుమారుడు జీవన్ (విజయ్) మరణించినట్లు గాంధీ తెలుసుకుంటాడు.

కానీ, కొన్నాళ్లకు రష్యాలో జీవన్‌ను చూస్తాడు. అతను నిజంగా గాంధీ కొడుకేనా? మేనన్‌తో అతనికి ఏమై సంబంధం? వీటికి సమాధానం తెలుసుకోవాలంటే ఈ ఆదివారం GOAT సినిమా తప్పకుండా చూడాల్సిందే!

Read this also…OPPO Reno13 Skyline-Blue variant goes on sale tomorrow..

Read this also…PhonePe Wealth Introduces CRISP: A Smarter Way to Select Mutual Funds

నటీనటులు & ముఖ్యాంశాలు:

విజయ్ ద్విపాత్రాభినయం
మీనాక్షి చౌదరి, స్నేహ, లైలా, మోహన్, ప్రశాంత్ కీలక పాత్రల్లో
యాక్షన్, ఎమోషన్, సస్పెన్స్ మేళవించిన కథ
యువన్ శంకర్ రాజా సంగీతం ప్రధాన ఆకర్షణ

థియేటర్లలో హిట్‌గా నిలిచిన ఈ సినిమా, బుల్లితెర ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి. మార్చి 23, ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు మీ జీ తెలుగులో తప్పక చూడండి!