365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఫిబ్రవరి11, 2025: ముంబై కేంద్రంగా పనిచేస్తూ, ఇటీవల తెలుగు రాష్ట్రాలలో తన కార్యకలాపాలను ప్రారంభించిన వోల్ఫ్జ్‌హౌల్ సంస్థ, వినయ్ భాస్కర్ ని దక్షిణ భారతదేశం కన్సల్టెంట్ – బిజినెస్ లీడ్ గా నియమించింది.

వినయ్ భాస్కర్ సేల్స్,మార్కెటింగ్ రంగంలో 15 ఏళ్లకు పైగా అనుభవం కలిగి, అడ్వర్టైజింగ్, డిజైన్ విభాగాల్లో ప్రావీణ్యతను సంపాదించారు. వోల్ఫ్జ్‌హౌల్ లో చేరిన తర్వాత, ఆయన బిజినెస్ ఇంటెలిజెన్స్, బిజినెస్ డెవెలప్‌మెంట్, క్లయింట్ రిలేషన్స్ విభాగాలకు నాయకత్వం వహించనున్నారు.

ఇది కూడా చదవండి..హైదరాబాద్‌లో ప్రియా లివింగ్ ఆవిష్కరణ – వృద్ధాప్యానికి కొత్త నిర్వచనం

ఇది కూడా చదవండి..హైడ్రా ప్రజావాణికి 64 ఫిర్యాదులు – వారంలోనే పరిష్కార చర్యలు

వ్యూహాత్మక ఆలోచనలతో పాటు, సృజనాత్మకతను సమ్మిళితం చేస్తూ సంస్థ వ్యాపార అభివృద్ధికి దోహదపడనున్నారు.

వోల్ఫ్జ్‌హౌల్ బ్యాంకింగ్, ఫార్మా, రియాల్టీ, ఎఫ్ఎమ్‌సిజి, రిటైల్ రంగాలలోని ప్రముఖ క్లయింట్లతో కలిసి పనిచేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇప్పటికే ICICI, Abbott, MSD, Bikaji, TCPL, Hotstar, Total Environment, Piramal Realty, Shoppers Stop వంటి ప్రముఖ కంపెనీలతో అనుభవం కలిగి ఉంది.

తెలుగు రాష్ట్రాలలోకి ప్రవేశించిన వోల్ఫ్జ్‌హౌల్, స్థానిక అడ్వర్టైజింగ్, డిజిటల్, పబ్లిక్ రిలేషన్స్ సంస్థలతో కలిసి పని చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. కొత్త బ్రాండ్లను నిర్మించి, ఆ వ్యాపారాలను అభివృద్ధి చేసే దిశగా ముందుకు సాగుతోంది.