365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, జనవరి 22,2025: సమగ్ర ఇంజినీరింగ్ సొల్యూషన్స్ సంస్థ అయిన వినిర్ ఇంజినీరింగ్ లిమిటెడ్, మార్కెట్ల నియంత్రణ సంస్థ అయిన సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాకి (సెబీ) తమ ముసాయిదా ప్రాస్పెక్టస్ (డీఆర్‌హెచ్‌పీ)ను సమర్పించింది.

ఈ ఐపీవోలో, నితేష్ గుప్తా (ప్రమోటర్ సెల్లింగ్ షేర్‌హోల్డర్) రూ. 2 ముఖ విలువ కలిగిన 5,33,00,000 ఈక్విటీ షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఏస్) విధానంలో విక్రయించనున్నారు.

వినిర్ ఇంజినీరింగ్ లిమిటెడ్, డిఫెన్స్, ఏరోస్పేస్, రక్షణ, రైల్వే, ఇతర పరిశ్రమలకు ప్రత్యేకంగా కీలకమైన, భారీ ప్రెసిషన్ ఫోర్జ్డ్ ఉత్పత్తులను తయారు చేసే కంపెనీ.

సాయుధ వాహనాలు, పోరాట పరికరాలు, మిలిటరీ హార్డ్‌వేర్, క్రయోజనిక్స్ సిస్టమ్స్, పవర్ టర్బైన్స్, గ్యాస్ టర్బైన్స్ వంటి వాటిలో ఈ ఉత్పత్తులు ఉపయోగిస్తారు.

20 కేజీల నుండి 6,000 కేజీల వరకు బరువున్న ఉత్పత్తులను తయారు చేయడానికి కంపెనీ యొక్క సామర్థ్యం ఉంది.

కంపెనీ మూడు ఉత్పత్తి యూనిట్లతో 38,000 ఎంటీపీఏ సామర్థ్యంతో పనిచేస్తోంది. బెంగళూరులో ఒకటి, హోసూర్ మరియు కలుకొండనపల్లిలో (తమిళనాడు) రెండు ఉత్పత్తి ప్లాంట్లు ఉన్నాయి.

అలాగే, అమెరికా, మెక్సికో, స్పెయిన్, మలేషియా,ఇతర దేశాల్లో కూడా కంపెనీ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. గత 3 ఆర్థిక సంవత్సరాల్లో, 2024 సెప్టెంబర్ 30తో ముగిసిన ఆరు నెలల వ్యవధిలో కంపెనీ 150 కస్టమర్లకు సేవలు అందించింది.

2023లో ప్రపంచవ్యాప్తంగా నాన్-ఆటోమోటివ్ ఫోర్జింగ్ మార్కెట్ విలువ 33.16 బిలియన్ డాలర్లుగా ఉండగా, 2030 నాటికి ఈ మార్కెట్ 54.54 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేసింది.

ఈ ఇష్యూకి పాంటోమత్ క్యాపిటల్ అడ్వైజర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్‌గా, కేఎఫ్ఐఎన్ టెక్నాలజీస్ లిమిటెడ్ సంస్థ రిజిస్ట్రార్‌గా పని చేస్తోంది.