Wed. Dec 4th, 2024
VIP-break-darshans

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుమల,24 డిసెంబర్ 2022:తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 27న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం సందర్భం గా ఆ రోజు వీఐపీ బ్రేక్ దర్శనాన్ని టీటీడీ రద్దు చేశారు.

డిసెంబర్ 27న ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరగనున్న నేపథ్యంలో టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది.

డిసెంబర్ 27న వీఐపీ బ్రేక్ దర్శనం కోసం డిసెంబర్ 26న ఎలాంటి సిఫారసు లేఖలు స్వీకరించబడవని, భక్తులు ఈ విషయాన్ని గమనించి టీటీడీకి సహకరించాలని కోరారు.

error: Content is protected !!