365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, తిరుమల, డిసెంబర్ 7,2024: ఆనంద నిలయం అనంత స్వర్ణమయం పథకానికి విరాళం ఇచ్చిన దాతలకు వీఐపీ బ్రేక్ (జనరల్) దర్శనం ఇవ్వాలని టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకుంది.
2008లో టీటీడీ ప్రారంభించిన ఈ పథకాన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల నిలిపివేసిన విషయం తెలిసిందే. అప్పట్లో ఈ పథకానికి విరాళం ఇచ్చిన దాతలకు అర్చనానంతర దర్శనం కల్పించాలని నిర్ణయం తీసుకోనుంది.
కానీ అర్చనానంతర దర్శన సేవ ప్రస్తుతం అందుబాటులో లేకపోవడంతో, ప్రస్తుత ధర్మకర్తల మండలి ఈ పథకం దాతలకు ప్రత్యామ్నాయంగా వీఐపీ బ్రేక్ (జనరల్) దర్శనం కల్పించాలని నిర్ణయించింది.
“ఆనంద నిలయం అనంత స్వర్ణమయం” పథకానికి సవరించిన సౌకర్యాల వివరాలు:
వీఐపీ బ్రేక్ (జనరల్) దర్శనం: ప్రతి సంవత్సరం గరిష్టంగా 5 మంది కుటుంబ సభ్యులకు 3 రోజులు వీఐపీ బ్రేక్ (జనరల్) దర్శనం అనుమతిస్తారు.
వసతి: రూ.2,500/- టారిఫ్‌తో, ప్రతి సంవత్సరం 3 రోజులు వసతి కల్పిస్తారు.
ప్రసాదం: ప్రతి సంవత్సరం ఒకసారి 20 చిన్న లడ్డూలు ప్రసాదంగా అందిస్తారు.
బహుమానం: దాతల దర్శన సమయంలో ప్రతి సంవత్సరం ఒకసారి ఒక దుపట్టా,ఒక బ్లౌజ్ బహుమానంగా అందిస్తారు.
బంగారు-వెండి నాణెం: మొదటి సారి దర్శన సమయంలో 5 గ్రాముల బంగారు డాలర్,50 గ్రాముల వెండి నాణెం బహుమానంగా ఇస్తారు.
మహాప్రసాదం: ప్రతి సంవత్సరం ఒకసారి పది మహాప్రసాదం ప్యాకెట్లు అందిస్తారు.
విరాళం పాస్‌బుక్: పాస్‌బుక్ జారీ తేదీ నుండి 25 సంవత్సరాలు చెల్లుబాటులో ఉంటుంది.
ఈ నిర్ణయం దాతలకూ, వారి కుటుంబాలకు, మరియు పథకానికి విరాళం ఇచ్చిన వారు అందుకునే ప్రత్యేక సౌకర్యాలకు సంబంధించిన అంశాలను స్పష్టం చేస్తుంది.