Sun. Sep 15th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఆగస్టు 2,2024: మహా మూవీస్, ఎమ్ 3 మీడియా పతాకంపై వరుణ్ సందేశ్ ప్రధాన పాత్రలో ఆద్యంత్ హర్ష దర్శకత్వంలో మహేంద్ర నాథ్ కూండ్ల నిర్మించిన చిత్రం “విరాజి”. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్ కు , ట్రైలర్ కి భారీ స్పందన వచ్చింది. ఈరోజు భారీ అంచనాలతో థీయోటర్ల లో విడుదలైన విరాజి మూవీ ఎలా ఉందో రివ్యూ లో ఇప్పుడు చూద్దాం. .

స్టోరీ..

రకరకాల కారణాలతో సీఐ ప్రభాకర్(బలగం జయరామ్), డాక్టర్ సుధా( ప్రమోదీని), స్టాండ్ అప్ కమెడియన్ వేద( కుశాలిని), సినిమా నిర్మాత కోదండరాం(కాకినాడ నాని), సెలబ్రిటీస్ ఆస్ట్రాలజిస్ట్ రామకృష్ణ( రఘు కారుమంచి), ఫోటోగ్రాఫర్ కాన్సెప్ట్ రాజు( రవితేజ నన్నిమాల) తో పాటు మొత్తం పదిమంది కొండమీద ఉన్న పాడుబడ్డ బంగ్లాలోకి వస్తారు.

అక్కడికి వచ్చిన తర్వాత వారందరూ మోసపోయి ఇక్కడికి వచ్చామని తెలుస్తుంది. ఈవెంట్ పేరుతో తమను మూసివేయ పడిన పిచ్చి ఆసుపత్రికి వచ్చేలా చేశారని తెలుసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోయేందు కు ప్రయత్నిస్తారు.

ఈ క్రమంలో నిర్మాత కోదండరాం తోపాటు ఫోటోగ్రాఫర్ కూడా దారుణ హత్యకు గురవుతారు దీంతో మిగిలిన వారంతా భయపడి ఆ పిచ్చి ఆసుపత్రిలోనే ఉంటారు.
ఆ టైంలో ఆండి (వరుణ్ సందేశ్) వారి దగ్గరికి వస్తాడు. ఆండి వచ్చిన తర్వాత ఆ పిచ్చి ఆసుపత్రిలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి..? అసలు ఈ పదిమందిని ఆసుపత్రికి వచ్చేలా ప్లాన్ చేసింది ఎవరు..?ఎందుకు చేశారు..? రోడ్డు ప్రమాదంలో చనిపోయిన సాగర్ కు వీళ్లకు మధ్య ఉన్న సంబంధం ఏంటి..? చివరకు ఆ ఆ పిచ్చి ఆసుపత్రి నుంచి బయటపడింది ఎవరు? అసలు ఆండి..? ఎవరు అతని నేపథ్యం ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే..!

అనాలిసిస్..

సొసైటీలో ఇప్పుడున్న ఒక్క కాంటెంపరరి ఇష్యూస్ ని తీసుకొని, దానికి థ్రిల్లర్స్ సస్పెన్స్ అంశాలను జోడించి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు.
సినిమా చివరి వరకు ట్విస్టులేవి రివిల్ చేయకుండా కథనాన్ని ఆసక్తికరంగా సాగించాడు. వేరువేరు నేపథ్యాలు ఉన్న పదిమంది ఒకే చోటికి రావడం.. వారిని అక్కడికి రప్పించిన వ్యక్తి ఎవరనేది తెలియకపోవడంతో.. అతను ఎవరు? ఎందుకు రప్పించారు? అనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో కలుగుతుంది. అయితే ఆ క్యూరియాసిటీని సినిమా క్లైమాక్స్ వరకు కంటిన్యూ చేశాడు డైరెక్టర్.

ఇంటర్వెల్ వరకు సస్పెన్స్, థ్రిల్లర్ జానర్ లో కథనం సాగుతుంది. ఇంటర్వెల్ సీను అదిరిపోవడంతో పాటు సెకండాఫ్ పై ఆసక్తిని పెంచుతుంది. సెకండ్ హాఫ్ లో వచ్చే ట్విస్టులు ఊహించని విధంగా ఉంటాయి. క్లైమాక్స్ లో వరుణ్ సందేశ్ తో వచ్చే సీన్ సినిమాకే హైలైట్. ఆ పదిమంది అక్కడికి రావడానికి గల కారణం ఊహించని విధంగా ఉంటుంది.
బరువెక్కిన హృదయంతో ప్రేక్షకు బయటకు వస్తాడు. నిడివి తక్కువ ఉండడం సినిమాకు బాగా కలిసి వచ్చింది.

నటీనటులు..

ఆండీ పాత్రలో వరుణ్ అద్భుతంగా నటించాడు. తెరపై ఆయన చాలా కొత్తగా కనిపించాడు.
సిఐ మురళిగా బలగం జయరాం చక్కగా నటించారు. సెలబ్రిటీ ఆస్ట్రాలజిస్ట్ రామకృష్ణగా
రఘు కారుమంచి తెరపై కనిపించేది కాసేపే అయిన .. ఉన్నంతలో నవ్వించే ప్రయత్నం చేశాడు.

ప్రమోదిని, వైవా రాఘవ, రవితేజ నన్నిమాల, కాకినాడ నాని, ఫణి ఆచార్య, అపర్ణాదేవి, కుశాలిని పూలప, ప్రసాద్ బెహరా తో పాటు అందరూ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతిక విభాగం..

ఎబెనైజర్ పాల్ నేపథ్య సంగీతం సినిమాకి ప్లస్ పాయింట్. తనదైన బిజిఎంతో కొన్ని సీన్లకు ప్రాణం పోశాడు. సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి ,నిర్మాత సైతం ఎక్కడ రాజీ పడకుండా సినిమా ని తెరకెక్కించారు.
రేటింగ్: 4/5..

ఇదికూడా చదవండి:లారీ చాప్టర్ 1 సినిమా రివ్యూ అండ్ రేటింగ్..

ఇదికూడా చదవండి: బిఎస్ఎన్ఎల్ సరికొత్త రికార్డ్.. 30 రోజుల్లో రెండు లక్షల కనెక్షన్లు..

ఇదికూడా చదవండి: మీకు ఇష్టమైన మొబైల్ నంబర్‌ను పొందవచ్చు.. BSNL సరికొత్త సదుపాయం..

Also read:Please give me something to eat, Sarabjot relishes food at India House after winning bronze

ఇదికూడా చదవండి: ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు..

ఇదికూడా చదవండి: వనస్థలిపురంలో జరిగిన సంఘటన పార్టీలతో యువత జీవితం అల్లకల్లోలం.

error: Content is protected !!