365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,13,2025: మందుబాబుల మధ్య మరో రసవత్తర సమరం నడుస్తోంది..! ఎవరిది పైచేయి? ఏది నంబర్ వన్? సారాయి సామ్రాట్దా? బ్రాందీ రారాజుదా? లేక బీరు భీముడుదా? అంటూ సోషల్ మీడియాలో కామెడీ వైరల్ అవుతోంది.

ఈ పోరులో కొత్తగా తెరపైకి వచ్చిన పాత్రలే ‘జిన్ జిగెల్స్’ , ‘వైన్ వైభోగం’. మరి మందు ప్రియుల పాలిట విజేత ఎవరు? చూద్దాం!
టైటిల్ పోరులో గెలిచేదెవరు..?
మందుబాబుల భాషలో ఆయా పానీయాలకు కొందరు అభిమానులు పెట్టిన సరదా పేర్లు ఇప్పుడు ఇంటర్నెట్లో నవ్వులు పూయిస్తున్నాయి. ఒకరు “సారాయి సామ్రాట్” అంటూ తన అభిమాన పానీయాన్ని పొగిడితే, ఇంకొకరు “బ్రాందీ రారాజు” అంటూ బ్రాందీకి జై కొడుతున్నారు. “విస్కీ చక్రవర్తి” అంటూ విస్కీకి పీఠం వేశారు.
వీరికి పోటీగా…

“బీరు భీముడు” అంటూ బీరు ప్రియులు తమ భీముడికి జై కొట్టారు.
“రమ్ రాజు” అంటూ రమ్ ప్రియులు తమ రాజ్యాన్ని విస్తరిస్తున్నారు.
“వోడ్కా వకీలు” అంటూ వోడ్కా న్యాయం చేస్తుందని వాదిస్తున్నారు.
జిన్ జిగెల్స్ Vs వైన్ వైభోగం: కొత్త ఎంట్రీలు..!
ఇటీవలి కాలంలో యువతలో బాగా పాపులర్ అవుతున్న జిన్కు “జిన్ జిగెల్స్” అనే కొత్త బిరుదును ఆపాదించారు. ఇది ట్రెండీగా, ఆధునికంగా ఉందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
ఇక, క్లాసిక్ టచ్తో, హుందాగా కనిపించే వైన్ను “వైన్ వైభోగం” అంటూ పొగిడారు. ఇది కేవలం పానీయం కాదు, ఒక జీవనశైలి అని వైన్ అభిమానులు వాదిస్తున్నారు.
ఈ సరదా పోలికలు, అభిమానుల వ్యంగ్య వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో మీమ్స్ గా, షేర్లుగా చక్కర్లు కొడుతూ నవ్వులు పంచుతున్నాయి. మరి ఈ టైటిల్ వార్లో ఎవరు గెలుస్తారో, ఏ పానీయం మందుబాబుల పాలిట “వైన్ విన్నర్” అవుతుందో కాలమే నిర్ణయించాలి.. !