365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, జనవరి 7,2025: ప్రసిద్ధ టెలికాం ఆపరేటర్ Vi (వోడాఫోన్ ఐడియా) నూతన సంవత్సరం 2025ను పురస్కరించుకొని, వినియోగదారులకు అనూహ్యమైన “సూపర్‌హీరో” పథకాన్ని అందించింది. ఈ పథకం కింద, ప్రతిరోజూ రాత్రి 12 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అపరిమిత హై-స్పీడ్ డేటా లభిస్తుంది.

డేటా వినియోగం పెరుగుతున్న ఈ డిజిటల్ యుగంలో, Vi తీసుకొచ్చిన ఈ ప్రాధమికత వ్యవస్ధ వినియోగదారులకు సమర్థవంతమైన, నిలకడైన డేటా సేవలను అందించడమే లక్ష్యంగా ఉంది.

సూపర్‌హీరో వార్షిక ప్యాకేజీల ప్రధాన ఫీచర్లు:
12 AM – 12 PM అపరిమిత డేటా
రోజులో మిగతా 12 గంటలకు 2GB రోజువారీ డేటా
వీకెండ్ డేటా రోల్‌ఓవర్ – వాడని వారాంతపు డేటాను వీకెండ్‌లో వాడుకునే అవకాశం
డేటా డిలైట్ ఫీచర్ – నెలలో రెండుసార్లు అదనంగా 1GB డేటా టాప్-అప్
ఓటిటి సబ్‌స్క్రిప్షన్‌లు – Disney+ Hotstar,Amazon Prime Lite ఒక సంవత్సరం పాటు ఉచితంగా అందించనుంది.

వార్షిక రీఛార్జ్‌లపై భారీ పొదుపులు:
Vi సూపర్‌హీరో వార్షిక ప్యాక్‌లు రోజుకు కేవలం రూ.10 కంటే తక్కువ ఖర్చుతో, వినియోగదారులకు 25% వరకు పొదుపును అందిస్తాయి. ఇది నెలవారీ ప్యాకేజీలతో పోలిస్తే రూ.1100కు పైగా ఆదా చేస్తుంది.

ఈ ప్యాకేజీలు ప్రత్యేకించి ఎక్కువ డేటా అవసరం ఉన్నవారికి, ఎంటర్టైన్‌మెంట్ ప్రియులకు, మొబైల్ డేటా వినియోగాన్ని నిరంతరం కోరుకునేవారికి చక్కటి పరిష్కారాన్ని అందిస్తాయి. సూపర్‌హీరో ప్లాన్‌తో Vi వినియోగదారులు డేటా, వినోదం, పొదుపులను ఒకే సమయంలో ఆస్వాదించవచ్చు!