365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,రాజేంద్రనగర్ ,జనవరి 12,2023: వివేకానంద స్వామి జయంతి వేడుకలు బీజేపీ అధ్వర్యంలో రాజేంద్ర నగర్ నియజకవర్గంలో ఘనంగా జరిగాయి.
ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ , బిజెపి రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్ వివేకానంద స్వామి విగ్రహానికి పులమాల వేసి వారి సేవలను స్మరించుకున్నారు.
అనంతరం బండి సంజయ్, బుక్క వేణుగోపాల్ రాజేంద్రనగర్ బిజెపి కార్యకర్తలతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు
ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు జి. మనోహర్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు బొక్క నరసింహ రెడ్డి, బిజెపి సీనియర్ నాయకులు విజయ్, జిల్లా ఓబీసీ మోర్చ కార్యదర్శి నానావల్ల కుమార్ యాదవ్, రాజేంద్రనగర్ నియోజకవర్గ బిజెపి బీజేవైఎం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.