365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,14జూలై 2022 :యునైటెడ్ నేషన్స్ సూచించినట్లుగా 2014వ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం జూలై 15వ తేదీని ప్రపంచ యుజవజన నైపుణ్యది నోత్సవం (డబ్ల్యువైఎస్‌డీ)గా జరుపుకుంటున్నారు. ఈ సంవత్సరం అంటే 2022 సంవత్సరాన్ని ‘భవిష్యత్ కోసం యువత నైపుణ్యాలను మెరుగు పరచడం’ (ట్రాన్‌ఫార్మింగ్ యూత్ స్కిల్స్ ఫర్ ద ఫ్యూచర్) నేపథ్యంతో వేడుక చేయనున్నారు. భవిష్యత్‌కు అవసరమైన నైపుణ్యాలను యువత సంతరించుకోవాల్సిన అవసరం వెల్లడిస్తూనే వారిని ఉద్యోగార్హులుగా తీర్చిదిద్దాల్సిన అవసరాన్ని డబ్ల్యువైఎస్‌డీ వెల్లడిస్తుంది.
కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో వేగవంతమైన సాంకేతిక ఆవిష్కరణలు మరియు మారుతున్న సామాజిక–ఆర్థిక ధోరణులు కారణంగా ఉద్యోగ బాధ్యతలు కూడా వేగవంతంగా మారుతున్నాయి. అంతేకాదు ప్రపంచ వ్యాప్తంగా1.3 బిలియన్‌ల మంది ప్రజలు తగిన నైపుణ్యాలు లేక సతమతమవుతున్నారు. అందువల్ల, ఈ నైపుణ్య వ్యవస్ధకు తగిన నైపుణ్యం, పునః నైపున్యం మరియు అదనపు నైపుణ్యాలను భారీగా సంతరించుకోవాల్సి ఉంది. మెక్‌కిన్సే నివేదిక ప్రకారం, గతంలో అంచనా వేసినట్లు కాకుండా మహమ్మారి కారణంగా తమ ఉద్యోగాలను 25%కుపైగా ఉద్యోగులు మార్చుకోవాల్సి రావొచ్చు.
డబ్ల్యువైఎస్‌డీ సందర్భంగా వాధ్వానీ ఫౌండేషన్ అధ్యక్షుడు,సీఈవొ డాక్టర్ అజయ్ కేలా మాట్లాడుతూ ‘‘కోవిడ్ కారణంగా వ్యాపారాలు డిజిటల్‌గా పరివర్తనం చెందడం కూడా అంతే వేగంగా పెరిగింది. అంతర్జాతీయంగా యువత కోసం అత్యధికంగా చెల్లిస్తోన్న ఉద్యోగాలు భారీ సంఖ్యలో తెరుచుకున్నాయి. ఈ డిజిటల్ ఉద్యోగాలను పొందడానికి పలు స్వల్పకాలిక శిక్షణా కార్యక్రమాలు తోడ్పడతాయి. ఇటీవలి కాలంలో విద్యార్హతల కంటే మెరుగైన నైపుణ్యాలకు అత్యధిక విలువను ఎంప్లాయర్లు అందిస్తున్నారు. వరల్డ్ యూత్ స్కిల్స్ డే 2022 పురస్కరించుకుని నేను ఈ అవకాశాలను స్వీయ ఆన్‌లైన్ రీ,అప్ స్కిల్లింగ్ ప్రోగ్రామ్‌ల ద్వారా అవకాశాలను ఒడిసిపట్టుకోవాల్సి ఉంది . తద్వారా వారి ఉద్యోగార్హతలు మెరుగుపరుచుకోవడంతో పాటుగా డిమాండ్‌లో ఉన్న నైపుణ్యాలు పెంచుకోవడానికి తమను తాము శక్తివంతం చేసుకోగలరు’’అని అన్నారు.
ప్రపంచ యువజన నైఫుణ్య దినోత్సవ సందర్భంగా వాద్వానీ ఫౌండేషన్ మరియు దీని నైఫుణ్యాధారిత కార్యక్రమం వాధ్వానీ ఆపర్ట్యునిటీలు ఎనిమిది కీలకమైన, అభివృద్ధి చెందుతున్న ధోరణులకు సంబంధించిన వివరాలను పంచుకున్నారు. ఇవి రాబోయే కాలంలో భారతీయ నైపుణ్య పర్యావరణ వ్యవస్థకు పునరాకృతిని అందిస్తాయి.నైపుణ్యాభివృద్ధి పరంగా వస్తోన్న మార్పులను మరింతగా వాధ్వానీ ఆపర్ట్యునిటీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, సునీల్ దహియా వెల్లడిస్తూ ‘‘పని ప్రాంగణంలో ప్రాధమిక మార్పులపై కోవిడ్-19 ప్రభావం చూపింది. ఇది సాంకేతికతలు-ఆటోమేషన్‌ను మెరుగుపరచడం ద్వారా భవిష్యత్‌కు సన్నద్ధమైన ఉద్యోగాల కోసం నైపుణ్యాన్ని కోరుతుంది.
సాంకేతిక నైపుణ్యాల ఆవశ్యకత మెరుగుపడటంతో పాటుగా సాఫ్ట్ లేదా ఎంప్లాయబిలిటీ నైపుణ్యాల ఆవశ్యకత కూడా పెరిగింది. పునరావృత మరియు జ్ఞానపరమైన ఉద్యోగాల పట్ల శ్రద్ధ వహిస్తున్నప్పుడు సామాజిక–భావోద్వేగ నైపుణ్యాలతో కూడిన బృందాలు ఖచ్చితమైన పోటీ ప్రయోజనాన్ని ఎలా కలిగి ఉంటాయనే దానిపై కూడా అవగాహన పెరుగుతోంది. అందువల్ల, వాధ్వానీ ఆపర్ట్యునిటీ ఇప్పుడు యువతను ఫ్యామిలీ సస్టెయినింగ్ ఉద్యోగాల దిశగా సన్నద్ధం చేయడానికి లోతైన డొమైన్ సాఫ్ట్,ఉద్యోగార్హత నైపుణ్యాలను అందించడంపై దృష్టి సారించింది’’ అని అన్నారు.