Fri. Nov 22nd, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్ ,కంది, 8 ఏప్రిల్‌ 2022 : తమ సుదీర్ఘమైన బంధానికి మరో ప్రతిష్టాత్మకమైన మైలురా యిని జోడిస్తూ వాగ్‌ బక్రీ ఫౌండేషన్‌ ఇప్పుడు అక్షయపాత్ర ఫౌండేషన్‌,మిషన్‌కు మద్దతునందించేందుకు పునర్ఘాటించింది. భారతదేశంలో బాలల పౌష్టికాహార సమస్యను పారద్రోలాలనే అక్షయ పాత్ర లక్ష్యానికి తోడ్పాటునందిస్తూ ఓ డెలివరీ వాహనం అందజేసింది.దీనిద్వారా తెలంగాణాలోని కంది వద్ద నున్న ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పౌష్టికాహార మధ్యాహ్న భోజనాలు అందించడం వీలవుతుంది.

ఈ వాహనం అక్షయపాత్ర కంది కిచెన్‌లో భాగం కావడంతో పాటుగా దాదాపు 83,951 మంది చిన్నారులకు వేలకు పైగా పౌష్టికాహార భోజనాలను అందించడం వీలవుతుం ది.ఈ వాహనాన్ని ఇటీవలనే వాగ్‌ బక్రీ టీ గ్రూప్‌ సీనియర్‌ జనరల్‌ మేనేజర్‌ (సేల్స్‌) పీవీ సురేష్‌ సమక్షంలో అక్షయ పాత్ర ఫౌండేషన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ (తెలంగాణా) యజ్ఞేశ్వర్‌ దాస ప్రభు అందుకున్నారు. ఈ సందర్భంగా బాగ్‌ బక్రీ టీ గ్రూప్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ , వాగ్‌ బక్రీ ఫౌండేషన్‌ ట్రస్టీ పరాస్‌ దేశాయ్‌ మాట్లాడుతూ ‘‘అక్షయ పాత్ర ఫౌండేషన్‌తో చేతులు కలపడం పట్ల మేము చాలా సంతోషంగా ఉన్నాము. సమాజానికి తిరిగివ్వడమనేది వాగ్‌ బక్రీ గ్రూప్‌ సంస్కృతి.

ఆహారం అనేది ప్రాధమిక హక్కుగా మేము భావిస్తుంటాము. ఈ కారణం చేత సరైన పౌష్టికాహారాన్ని సమాజానికి అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాము. అక్షయపాత్రకు మేము ఆరు వాహనాలను అందించాము. వీటిద్వారా భారతప్రభుత్వ మధ్యాహ్న భోజన పథకానికి సేవలను అందిస్తున్నాము. అక్షయ పాత్ర మరింత మందికి చేరుకోవడానికి ఈ వాహనాలు తోడ్పడతాయి’’అని అన్నారు. అక్షయపాత్ర ఫౌండేషన్‌ వైస్‌ ఛైర్మన్‌ చంచలపతి దాస మాట్లాడుతూ ‘‘గత 21 సంవత్సరాలుగా మేము వేడి, పౌష్టికాహార భోజనాలను ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం ద్వారా అందిస్తున్నాము. ప్రభుత్వ

సహకారానికి తోడు కార్పోరేట్‌ సంస్థల మద్దతుతోనే మేము విజయవంతం కాగలుగుతున్నాము. వాగ్‌ బక్రీ తో మాకు సుదీర్ఘమైన అనుబంధం ఉంది. ఈ విరాళాలతో తెలంగాణాలో మరింత మంది విద్యార్థులను చేరుకోగలం’’ అని అన్నారు.

error: Content is protected !!