Mon. Nov 25th, 2024
Virtual inauguration ceremony of the new plant was conducted by Shri Amit Shah, Hon'ble Minister for Home Affairs, Government of India

365 తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ,జనవరి 30,2021:ఈవీ విభాగంలో  సుప్రసిద్ధ కంపెనీలలో ఒకటైన, జాయ్‌–ఈ బైక్,వ్యోమ్‌ ఇన్నోవేషన్స్‌ వంటి బ్రాండ్లు సొంతం చేసుకున్న వార్డ్‌విజార్డ్‌ ఇన్నోవేషన్స్‌ అండ్‌ మొబిలటీ లిమిటెడ్‌ తమ అత్యాధునిక  కర్మాగారాన్ని గుజరాత్‌లోని వదోదర వద్ద విద్యుత్‌ ద్వి చక్ర వాహనాలను తయారుచేసేందుకు ప్రారంభించింది. ఈ కంపెనీ దాదాపు 45 కోట్ల రూపాయలను ఈ నూతన ప్లాంట్‌లో పెట్టుబడిగా పెట్టడంతో పాటుగా మొదటి దశలో ఒక షిఫ్ట్‌లో ఒక లక్ష ద్వి చక్ర వాహనాలను ఒక సంవత్సరానికి ఉత్పత్తి చేయనుంది. కంపెనీ నాలుగు నూతనమోడల్స్‌, అత్యున్నత పనితీరు కలిగిన విద్యుత్‌ బైక్‌లు– బీస్ట్‌, థండర్‌ బోల్ట్‌, హరికేన్‌, స్కైలైన్‌ విడుదల చేసింది. ఈ నూతన ప్లాంట్‌ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా ఆరు వేల మందికి ఉపాధిని అందించనుంది. వర్ట్యువల్‌గా ఈ కర్మాగారాన్ని గౌరవనీయ భారత హోంశాఖామాత్యులు అమిత్‌ షా ప్రారంభించారు.

Virtual inauguration ceremony of the new plant was conducted by Shri Amit Shah, Hon'ble Minister for Home Affairs, Government of India
Virtual inauguration ceremony of the new plant was conducted by Shri Amit Shah, Hon’ble Minister for Home Affairs, Government of India

ఈ కార్యక్రమంలో రంజన్‌బెన్‌ భట్‌, పార్లమెంట్‌ సభ్యులు,  వదోదర,రాజేంద్ర త్రివేది, స్పీకర్‌, గుజరాత్‌ రాష్ట్ర అసెంబ్లీ పాల్గొన్నారు.ఈ సందర్భంగా యతిన్‌ గుప్తా, ఛైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, వార్డ్‌విజార్డ్‌ గ్రూప్‌ మాట్లాడుతూ ‘‘విద్యుత్‌ బైక్‌లకు డిమాండ్‌ గణనీయంగా పెరుగుతుంది. 2025  నాటికి ఈవీ ద్విచక్రవాహన మార్కెట్‌లో 25% వాటా సొంతం చేసుకోగలమని ఆశిస్తున్నాము. కంపెనీకి ప్రస్తుతం 10కు పైగా ఈ బైక్‌లు, ఈ–స్కూటర్‌లు ఉన్నాయి. రాబోయే 3–4 సంవత్సరాలలో  500–600 కోట్ల రూపాయల ఆదాయాన్ని కంపెనీ లక్ష్యంగా చేసుకోవడంతో పాటుగా  విద్యుత్‌ మూడు చక్రాల వాహనం ఆవిష్కరించడానికి సైతం లక్ష్యంగా చేసుకుంది’’ అని అన్నారు.

error: Content is protected !!