365 తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ముంబై,ఇండియా,7మార్చి 2022: భారతీయ క్రికెటర్ ప్రవీణ్ తాంబే జీవితంపై అధికారిక బయోపిక్ “కౌన్ ప్రవీణ్ తాంబే” నిర్మిస్తున్నట్టు ఫాక్స్ స్టార్ స్టూడియోస్, ఫ్రైడే ఫిల్మ్‌వర్క్స్, బూట్‌రూమ్ స్పోర్ట్స్ ప్రొడక్షన్ నేడు ప్రకటించి ఆ సినిమా తొలి పోస్టర్ విడుదల చేశాయి.
ఏప్రిల్ 1, 2022న డిస్నీ+ హాట్‌స్టార్‌లో విడుదలయ్యే ఈ చిత్రానికి దర్శకుడు జయప్రద్ దేశాయ్. ప్రముఖ నటుడు శ్రేయస్ తల్పాడే స్ఫూర్తిదాయకమైన ప్రవీణ్ పాత్రలో నటించారు. క్రికెట్ అంటే హుషారు, సరదా, సవాళ్లు, పులకరింతే కాదు హృదయాలను కదిలించే ఈ చిత్రం ఈ క్రికెటర్ జీవితంలోని లోతులు చూపుతుంది. 41 ఏళ్ల వయస్సులో రాజస్థాన్ రాయల్స్ జట్టు కోసం ఆడటం ప్రారంభించిన లెగ్ స్పిన్నర్ కలలను, క్రికెట్ అంటే అతనికి ఉన్న ప్రేమను నిరూపించేందుకు అలుపెరగని పట్టుదలను ఈ చిత్రం చూపుతుంది.
ఈ చిత్రంలోని ఇతర కీలక పాత్రల్లో ఆశిష్ విద్యార్థి, పరంబ్రత ఛటర్జీ, అంజలి
పాటిల్ నటించారు.తన బయోపిక్‌పై క్రికెటర్ ప్రవీణ్ తాంబే మాట్లాడుతూ, నా కథ చాలా మందికి స్ఫూర్తిగా నిలిచి ఇప్పుడు సినిమాగా వస్తుండటం నాకు దక్కిన ఒక గొప్ప గౌరవంగా భావిస్తాను. కలలు సాధించేందుకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ పట్టుదల కోల్పోకుండా, తమను తాము ఎప్పుడూ తక్కువ అంచనా వేసుకోకుండా జీవించాలన్నది నా ఏకైక కోరిక.
నా కథ ఇలా సజీవంగా వస్తుండటంతో మా కుటుంబం, ప్రేమించే వ్యక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ రోజు నాకు ఎంతో ప్రత్యేకమైన రోజు” అన్నారు.
ప్రవీణ్ తాంబే పాత్ర పోషిస్తున్న నటుడు శ్రేయాస్ తల్పాడే మాట్లాడుతూ: “17 సంవత్సరాల తర్వాత ఇక్బాల్‌లో హీరో పాత్ర పోషించిన తర్వాత ఇప్పుడు ప్రవీణ్ పాత్రను పోషించడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ పాత్ర, ఈ కథ నాకు జీవితకాలంలో దక్కిన అపురూపమైన అవకాశం. చిత్రీకరణ ప్రతి నిమిషాన్ని నేను ఎంతో ఆస్వాదించాను,ఇష్టపడ్డాను.
బూట్‌రూమ్ స్పోర్ట్స్, ఫాక్స్ స్టార్ స్టూడియోస్‌కు నేను కృతజ్ఞుడినై ఉంటాను. ఈ పాత్రలో నన్ను ఊహించిన అద్భుత ప్రతిభాశాలి దర్శకుడు జయప్రద్ నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ప్రవీణ్ పాత్ర పోషించడం గౌరవంగా భావిస్తున్నాను. ఈ పాత్ర కోసం సిద్ధమయ్యేందుకు ఆయనతో గడిపిన సమయం ఎంతో అమూల్యమైనది. దాని కోసం ఎంతో కొత్తస్థాయి అంకితభావం అవసరం. ఈ సినిమాను ప్రేక్షకులు ఆస్వాదించడమే కాదూ స్ఫూర్తిని పొందుతారని నేను ఆశిస్తున్నాను” అన్నారు.
ఈ బయోపిక్‌పై డిస్నీ స్టార్+ హెడ్ బిక్రమ్ దుగ్గల్ మాట్లాడుతూ, “ప్రేక్షకులందరికీ ప్రత్యేకమైన, స్పూర్తిదాయకమైన సినిమాలు ముఖ్యంగా అత్యంత వినోదభరితమైన చిత్రాలు రూపొందించాలన్నది మా ప్రయత్నం. ‘కౌన్ ప్రవీణ్ తాంబే?’ అలాంటి కథే. క్రికెట్‌ని లక్షలాది మంది ఆరాధిస్తారు, ప్రేమిస్తారు, దానికి వదులుకోవడానికి నిరాకరించిన ఒక ఛాంపియన్ జత కలిశారు, అంతే ఒక అద్బుతమైన చిత్రం ‘కౌన్ ప్రవీణ్ తాంబే?’ రూపుదిద్దుకుంది. స్ఫూర్తిదాయకమైన ప్రవీణ్ తాంబే కథను ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంలో మా వంతు పాత్ర
పోషించడం అదృష్టంగా భావిస్తున్నాం.
ఈ పాత్రకు శ్రేయాస్ తల్పాడే సరిగ్గా సరిపోయాడు. తన అద్భుతమైన నటనతో ఈ పాత్రకు న్యాయం చేశారు. ఏప్రిల్ 1న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నాం” అన్నారు. శీతల్ భాటియా ఫౌండర్ – ఫ్రైడే ఫిల్మ్‌వర్క్స్ & బూట్‌రూమ్ స్పోర్ట్స్ మాట్లాడుతూ “మా స్పోర్ట్స్ బిజినెస్’బూట్‌రూమ్ స్పోర్ట్స్’ని ప్రారంభిస్తున్నానని ప్రకటించడం చాలా చాలా సంతోషం కలిగిస్తోంది. ప్రత్యేకమైన స్ఫూర్తిదాయకమైన స్పోర్ట్స్ కంటెంట్ అందించే ఈ వ్యాపారాన్ని మొదలుపెట్టేందుకు ప్రవీణ్ తాంబే కథ కంటే మెరుగైన సందర్భం ఇంకొకటి ఉండదేమో. ఫాక్స్ స్టార్ స్టూడియోస్, డిస్నీ+ హాట్‌స్టార్ లేకుండా కథ సాధ్యమయ్యేది కాదు. సృజనశీలురైన జయప్రద్ దేశాయ్, శ్రేయాస్ తల్పాడే సహ వారి మొత్తం బృందం కృషి, అంకితభావంతో కష్టసాధ్యమైన ప్రవీణ్ తాంబే జీవితం ఒక ఆకట్టుకునే కథ మారింది. స్వయంగా ప్రవీణే లక్షలాది
మందికి స్ఫూర్తిగా నిలిచి కలలు ఎప్పటికీ కల్లలుగా ఉండవని తెలియజేశారు” అన్నారు.