365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,నేషనల్, జనవరి,25,2021:మంచి కంటెంట్ కావాలి, కాని బడ్జెట్ ఆంక్షల కారణంగా ఏం చేయలేకపోతున్నారా- ఇక ఆందోళన అవసరం లేదు. మా దగ్గర పరిష్కారం ఉంది. అమెజాన్ ప్రైమ్ వీడియో కొత్తగా ఆవిష్కరించిన మొబైల్ ఎడిషన్ ప్లాన్‌తో ఇప్పుడు మీరు సరికొత్త సినిమాలు, సిరీస్ చూడవచ్చు, అది కూడా ఒక నెలపాటు ఉచితంగా!
భారతీయ నెటిజన్లు కలలో కూడా ఊహించని ఆఫర్‌ను ఈ కొత్త సంవత్సరం సందర్భంగా అమెజాన్ ప్రైమ్
వీడియో తీసుకువచ్చింది. ఎయిర్‌టెల్ సహకారంతో ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ (PVME)ను రూ.89
ప్రారంభ ధరతో ఆవిష్కరించింది. ఇది సింగిల్ యూజర్ మొబైల్ ప్లాన్ (అంటే ఇక మీరు ఓటీటీ,సబ్‌స్క్రిప్షన్‌ను స్నేహితులు, కుటుంబసభ్యులతో పంచుకోవాల్సిన అవసరం లేదు). ఎయిర్‌టెల్ యూజర్లు,అమెజాన్ ప్రైమ్ వీడియోలను 1 నెల పాటు ఎస్‌డీ క్వాలిటీలో PVMEలో ఉచితంగా చూడవచ్చు. ఇక సబ్‌స్క్రిప్షన్ పూర్తైంది కదా, మీ ME టైమ్‌లో అమెజాన్ ప్రైమ్ వీడియో స్ట్రీమ్ చేస్తున్న సరికొత్త హిందీ బ్లాక్‌బస్టర్ల జాబితాను చూద్దాం.
శకుంతలా దేవి
మానవ కంప్యూటర్‌గా పేరుగాంచిన శకుంతాల దేవి పాత్రలో అద్భుతమైన నటనను గతేడాది ప్రదర్శించింది
విద్యాబాలన్. గణిత మేధావిగా ఆమె ప్రయాణాన్ని చూపడమే కాదు, తల్లిగా, ఒక మహిళగా ఎదుర్కొన్న
సమస్యలతో పాటు ఆమె తెలివితేటలు, లోపాలు, బలహీనతలను శకుంతాల దేవి చిత్రం వెండితెరపై
ఆవిష్కరించింది. అనూ మేనన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సాన్యా మల్హోత్రా, అమిత్ సాధ్, జిషూ
సేన్‌గుప్తా ఇతర ప్రధాన పాత్రల్లో కనిపిస్తారు.
గులాబో సీతాబో
షుజిత్ సర్కార్ దర్శకత్వంలో రూపొందించిన గులాబో సీతాబో చిత్రంలో విసిగిపోయిన ఒక అద్దెదారు పాత్రలో ఆయుష్మాన్ ఖురానా (బన్కే) అద్భుతమైన నటనను ప్రదర్శించారు. అద్దెకుంటున్న ఒక పాడుబడిన హవేలిని ఖాళీ చేయకూడదని నిర్ణయించుకోవడంతో యజామాని మీర్జాతో (అమితాబ్ బచ్చన్) రోజు తగువుపడాల్సి వస్తుంది. రెండు తరాలకు చెందిన వైవిధ్యభరితమైన నటులను ఒకేసారి వెండితెరపై చూడటం నిజంగా మైమరపిస్తుంది. బన్కే, మీర్జా మధ్య ప్రేమద్వేషాలను అలా కళ్లార్పకుండా చూడాల్సిందే.
మరి యుద్ధం జరగబోతోంది, మీరు ఎవరి పక్షాన నిలుస్తారు?
అన్‌పాస్డ్
మహమ్మారి ప్రపంచాన్ని చుట్టేసిన వేళ కొత్త ఆరంభాన్ని, ఆశలను రేకేత్తిస్తుంది అన్‌పాస్డ్. 5 కథలతో కూడిన
ఈ చిత్రాన్ని హిందీ చిత్రరంగంలో ఖ్యాతి గడించిన ఐదుగురు గొప్ప దర్శకులు రాజ్ అండ్ డీకే, నిఖిల్
అడ్వాణీ, తనిష్ఠ ఛటర్జీ, అవినాష్ అరుణ్, నిత్యా మెహ్రా రూపొందించారు. రత్నా పాఠక్ షా, రిచా ఛడ్డా,
సుమీత్ వ్యాస్, సయామీ ఖేర్, రింకూ రాజ్‌గురు, గుల్షన్ దేవయ్య, ఇష్వాక్ సింగ్, లిలిట్ దూబే,
అభిషేక్ బెనర్జీ, గీతికా విద్యా ఓహ్లాన్, శార్దూల్ భరద్వాజ్ వంటి మేటి నటీనటులు నటించిన ఈ చిత్రం ప్రతీ
ఒక్కరిని, చీకట్లు ముసిరిన ఈ సమయంలో కొత్త ఉత్సాహాన్ని నింపుతూ ప్రతీ ఒక్కరిని కదిలిస్తుంది.
శుభ్ మంగళ్ జ్యాదా సావధాన్
ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్రంలో ఆయుష్మాన్ ఖురానా, జితేంద్ర కుమార్
అలియాస్ జీతూ ప్రధాన పాత్రల్లో నటించారు. ఎల్‌జీబీటీక్యూ వర్గంపై అవసరమైన చర్చను ఈ చిత్రం
ప్రారంభిస్తుంది. ఆయుష్మాన్, జితేంద్ర స్వలింగ ప్రేమికులు. దీన్ని జీతూ కుటుంబం వ్యతిరేకిస్తుంది. వారి సంబంధం తగదని నచ్చజెప్తుంది. సరదాగా సాగే ఈ చిత్రం మంచి టాక్ సంపాదించుకుంది. ఇది కచ్చితంగా
మీరు చూడాల్సిన సినిమా లిస్టులో ఉండాలి. అంతే కాదు అందమైన ఆన్ స్క్రీన్ జంట నీనా గుప్తా-గజ్‌రాజ్
రావును శుభ్ మంగళ్ జ్యాదా సావధాన్‌లో మరోసారి చూడవచ్చు.
థప్పడ్
అనుభవ్ సిన్హా దర్శకత్వంలో రూపొందించిన థప్పడ్‌లో ప్రధాన పాత్రధారి తాప్సీ పన్నూ. ఇది అమృత
(తాప్సీ) కథను తెలియజేసే చిత్రం. కార్పొరేట్ ప్రపంచంలో తాను సాధించిన విజయాన్ని వేడుక చేసుకునే సందర్భంలో అమృత భర్త విక్రమ్ (పావైల్ గులాటీ) ఆమెను అందరి ముందు చెంపదెబ్బ కొడతాడు. ఇది ఆమె జీవితాన్ని మార్చేస్తుంది. భర్త విక్రమ్, అతని కుటుంబ ఆలనాపాలన చూస్తూ ఆనందంగా జీవిస్తున్న
అమృత, భర్త అందరి ముందు చెంప దెబ్బ కొట్టడాన్ని అవమానంగా భావించి విడాకులు తీసుకోవాలని
నిర్ణయించుకుంటుంది. సొంత కుటుంబంలో ఏళ్లుగా మహిళ ఎదుర్కొనే చీత్కారాలు, స్త్రీల పట్ల ద్వేషాన్ని ఈ
సామాజిక చిత్రం చక్కగా చూపుతుంది.