Sun. Dec 1st, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, నవంబర్ 15,2024: బాల్యాన్ని బంధించేస్తు న్నామని ప్రోగ్రెసివ్ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షురాలు డా.హిప్నో పద్మా కమలాకర్ ఆవేదన వ్యక్తంచేశారు.నవంబర్ 14వ తేదీ పిల్లల దినోత్సవం సంద ర్భంగా డా.హిప్నో కమలాకర్స్ మైండ్ అండ్ పర్సనాలిటీ కేర్ నవభారత లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జవహర్ నగర్ స్లం ఏరియాలో పిల్లలకు పోషకాహారం, నోట్ పుస్తకాలను, అంబిక ,సి.హెచ్. సుభాషిణి,జి.కృష్ణ వేణి , శోభా రాణి,డా.హిప్నో పద్మా కమలాకర్ పంపిణీ చేశారు. ఆమె మాట్లాడుతూ బాల్యాన్ని బంధించడం వల్ల మానసిక సమస్యలు వస్తాయన్నారు.

బాల్యం అంటే జీవితంలోనే అమూల్యమైన, ఆనందంగా గడిచే ఒక అద్భుతమైన దశన్నారు. బాల్యంలో ఉన్నప్పుడు పిల్లలు ప్రపంచాన్ని తెలుసుకోవటంలో ఆసక్తి చూపిస్తారని తెలిపారు. కొత్త విషయాలను నేర్చుకుంటారన్నారు. ఆ క్షణాల అమాయకత్వం, ఆ క్షణాల ఆటలు, ముద్దుల మాటలు అన్నీ పిల్లలకు ఒక స్వచ్ఛమైన అనుభూతిని కలిగిస్తాయని చెప్పారు.

బాల్యంలో పిల్లలకు ఉన్న ఆ స్వేచ్ఛ, ఆనందం, భయపడకుండా ఉండే తత్వం పెద్దయ్యాక మరిచి పోతారు న్నారు. ఈ దశలో వారు ఏదైనా నిర్భయంగా ప్రశ్నిస్తారన్నారు. నేర్చుకోవటానికి ఉత్సాహంతో ఉండి, కొత్త విషయాలను తెలుసుకొవాలనే ఆసక్తి ఉంటుందన్నారు. ఇది పిల్లల వ్యక్తిత్వానికి, ఆలోచనల పరిపక్వతకు పునాది వేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పిల్లలు ఆట పాటలతో సందడి చేశారు.
డా.హిప్నో పద్మా కమలాకర్ కౌన్సెలింగ్ సైకో థెరపీస్ట్, హిప్నో థెరపీస్ట్ @ 9390044031.

error: Content is protected !!