Sat. Jul 13th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, జూన్ 26,2024: మరింత అందుబాటు ధరలో మరింత వినోదాన్ని పొందే దిశగా మారుతున్న వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా సేవలు అందించడాన్ని కొనసాగిస్తూ టెలికం ఆపరేటరు వీ (Vi) తమ కంటెంట్ అగ్రిగేటర్ యాప్, వీ మూవీస్ అండ్ టీవీ (Vi Movies & TV)ని ఈ ఏడాది సరికొత్త రూపంలో ప్రవేశపెట్టింది.

డిస్నీ+ హాట్‌స్టార్ వంటి ప్రస్తుత టాప్ సంస్థలకు అదనంగా ప్రముఖ ఓటీటీ సంస్థల్లో ఒకటైన జీ5తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు వీ తాజాగా ప్రకటించింది. దీనితో వీ మూవీస్ అండ్ టీవీ యాప్ ఇప్పుడు ఒకే సింగిల్ సబ్‌స్క్రిప్షన్‌తో నెలకు రూ. 248తో 17 ఓటీటీ యాప్‌లను అందిస్తుంది.

వీ మూవీస్ అండ్ టీవీకి సింగిల్ సబ్‌స్క్రిప్షన్ తీసుకోవడం ద్వారా వీ యూజర్లు ఇకపై డిస్నీ+ హాట్‌స్టార్, సోనీ లివ్, జీ5 వంటి ప్రముఖ యాప్‌లలోని తమ ఫేవరెట్ కంటెంట్‌ను మొబైల్, టీవీల్లో ఆస్వాదించవచ్చు.

విద్యా బాలన్ నటించిన దో ఔర్ దో ప్యార్, ప్రస్తుతం కొనసాగుతున్న ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2024, మంజుమ్మెల్ బాయ్స్, అరణ్మనై 4 వంటి ప్రాంతీయ భాషల్లోని బ్లాక్‌బస్టర్ సినిమాలు, షోలను డిస్నీ+ హాట్‌స్టార్ యాప్‌లో; యూఈఎఫ్ఏ యూరో కప్, ‘గుల్లక్’ సీజన్ 4, శ్రీలంకలో భారత్ టూర్, స్కామ్ 2003, రాకెట్ బాయ్స్ మొదలైనవాటిని సోనీ లివ్‌లో; ‘సన్‌ఫ్లవర్’, ‘బ్రోకెన్ న్యూస్’, తాజ్ వంటి షోలు, ‘సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై’, ‘కడక్ సింగ్’, ‘వీర్ సావర్కర్’, ‘శామ్ బహదూర్’ వంటి సినిమాలు ఇంకా మరెన్నింటినో జీ5లో వీ యూజర్లు ఆస్వాదించవచ్చు.

“సౌకర్యం, మరింత అదనపు విలువ అనే రెండు అంశాలు భారత్‌లో కొనుగోలు నిర్ణయాలను ప్రభావితం చేయడంలో కీలకమైనవని వీ భావిస్తోంది. దానికి తగ్గట్లుగా మా కస్టమర్ల అవసరాలకు అనుగుణమైన సొల్యూషన్స్ అందించేందుకు కట్టుబడి ఉన్నాం. మా కంటెంట్ అగ్రిగేటర్ ప్లాట్‌ఫాం అయిన వీ మూవీస్ అండ్ టీవీ యాప్ ఒకే ఒక్క ప్లాన్‌తో 17 ఓటీటీ ప్లాట్‌ఫాంలకు యాక్సెస్ అందిస్తుంది.

దీని వల్ల వినోద వినియోగంపై వ్యయాలు తగ్గడమే కాకుండా వివిధ ఓటీటీ యాప్‌లకు వేర్వేరుగా సబ్‌స్క్రయిబ్ చేసుకునే సమస్యా తప్పుతుంది” అని వొడాఫోన్ ఐడియా చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అవనీష్ ఖోస్లా తెలిపారు.

“వివిధ సబ్‌స్క్రిప్షన్లు తీసుకోవాల్సిన భారాన్ని, ఖర్చును తగ్గించే, సౌకర్యవంతమైన ఆప్షన్‌తో నిరాటంకంగా వినోదపు అనుభూతిని అందిస్తూ వినియోగదార్లకు వీ మూవీస్ అండ్ టీవీ యాప్ మరింత చేరువ కాగలదని మేము విశ్వసిస్తున్నాం. అత్యంత నాణ్యమైన వినోదాన్ని మా యూజర్లకు అందుబాటులో ఉంచాలని, వివిధ ఓటీటీ ప్లాట్‌ఫాంలతో వ్యూహాత్మక భాగస్వామ్యాల ద్వారా వారికి మరింత మెరుగైన వీక్షణ అనుభూతిని అందించాలనేది మా లక్ష్యం. అత్యుత్తమ వినోదపు అనుభూతిని మా యూజర్లకు అందించే దిశగా మా సేవలను విస్తరించడాన్ని కొనసాగిస్తాం” అని ఆయన పేర్కొన్నారు.

వైవిధ్యమైన కంటెంట్‌కు ప్రాధాన్యత,కనెక్టెడ్ డివైజ్‌లకు ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో వీ మూవీస్ అండ్ టీవీ యాప్ సరికొత్త రూపంలో ఖర్చును ఆదా చేసే ప్లాన్లతో, అసమానమైన వినోదపు అనుభూతిని అందిస్తోంది. యూజర్లు ఇప్పుడు ఈ కింది వాటిని ఆస్వాదించవచ్చు:

●       డిస్నీ+ హాట్‌స్టార్, సోనీ లివ్, జీ5 లాంటి 17 ప్రీమియం ఓటీటీ ప్లాట్‌ఫాం సబ్‌స్క్రిప్షన్లు, స్పోర్ట్స్ కోసం ఫ్యాన్‌కోడ్‌తో పాటు క్లిక్ (బెంగాలీ), చౌపల్ (పంజాబీ), అత్రంగీ (దేశీ హిందీ కంటెంట్), మనోరమ మ్యాక్స్ (మలయాళం), నమ్మఫ్లిక్స్ (కన్నడ), హిందీలోకి డబ్ చేసిన కొరియన్ షోల కోసం ప్లేఫ్లిక్స్ వంటి ప్రాంతీయ కంటెంట్ ప్లాట్‌ఫాంలతో మరింత కంటెంట్‌ను ఆస్వాదించండి. దీనితో ఆజ్ తక్, ఏబీపీ న్యూస్, రిపబ్లిక్ మొదలైన 350 పైచిలుకు లైవ్ టీవీ చానెల్స్‌తో పాటు యూరోస్పోర్ట్స్, టీఎల్‌సీ వంటి లైఫ్‌స్టయిల్ చానెల్స్‌ను కూడా పొందవచ్చు.

●       అన్నింటికీ నిరాటంకంగా యాక్సెస్ పొందేందుకు ఒకే ప్లాన్, ఒకే సబ్‌స్క్రిప్షన్

●       ఫేవరెట్ షోలు, సినిమాలను ఎప్పుడైనా, ఎక్కడైనా, ఏ డివైజ్‌లోనైనా స్ట్రీమ్ చేసే సౌకర్యం. వీ మూవీస్ అండ్ టీవీ యాప్‌ను, ఆండ్రాయిడ్/గూగుల్ టీవీ, ఆండ్రాయిడ్ మొబైల్, సామ్‌సంగ్ టీవీ, ఐవోఎస్ మొబైల్, అమెజాన్ ఫైర్‌స్టిక్ టీవీ వంటి కనెక్టెడ్ టీవీలు, స్మార్ట్ టీవీలు, మొబైల్‌తో పాటు వెబ్‌కి కూడా పెయిర్ చేయొచ్చు.

వీ మూవీస్ & టీవీకి సబ్‌స్క్రయిబ్ చేసుకోవడం ద్వారా యూజర్లు అన్ని ఓటీటీ ప్లాట్‌ఫాంలను ఏకకాలంలో రెండు చోట్ల స్ట్రీమింగ్ ద్వారా చూసేందుకు వీలుంటుంది.

●       బడా పొదుపు: 17 వేర్వేరు ఓటీటీ ప్లాట్‌ఫాంలకు వేర్వేరుగా సబ్‌స్క్రయిబ్ చేసుకోవడంతో పోలిస్తే వీ మూవీస్ అండ్ టీవీ అందించే ఒకే ఒక్క సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌తో ఖర్చు దాదాపు 50 శాతం తగ్గుతుంది.

వీ మూవీస్ అండ్ టీవీ ప్లస్ మరియు వీ మూవీస్ అండ్ టీవీ లైట్ అనే రెండు కొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్లను కూడా వీ ప్రకటించింది

●       వీ మూవీస్ అండ్ టీవీ – ప్లస్:  దీని ధర నెలకు రూ. 248గా ఉంటుంది. 17 ఓటీటీ యాప్‌లు, 350 లైవ్ టీవీ చానెల్స్, వివిధ కంటెంట్ లైబ్రరీలకు అపరిమిత యాక్సెస్ పొందవచ్చు. ఈ ప్లాన్‌ను రెండు డివైజ్‌లపై – టీవీ మరియు మొబైల్‌లో – యాక్సెస్ చేయొచ్చు. ప్రీపెయిడ్ యూజర్లకు ఇందులోనే అదనంగా 6 జీబీడేటా లభిస్తుంది.

●       వీ మూవీస్ అండ్ టీవీ – లైట్:  నెలకు రూ. 154 ధర ఉండే ఈ ప్లాన్ ప్రత్యేకంగా ప్రీ-పెయిడ్ యూజర్ల కోసం ఉద్దేశించినది. ఇది ఒక్క సింగిల్ మొబైల్ డివైజ్‌పై, 16 ఓటీటీ యాప్‌లకు మరియు విస్తృతమైన కంటెంట్‌ కేటలాగ్‌కు సులభతరంగా యాక్సెస్ అందిస్తుంది. అదనంగా 2 జీబీ డేటా పొందవచ్చు.

ప్రీపెయిడ్ యూజర్లకి నెలకు రూ. 202కు, పోస్ట్‌పెయిడ్ యూజర్లకి నెలకు రూ. 199కే 13+ ఓటీటీలకు యాక్సెస్‌ ఇస్తున్న వీ మూవీస్ అండ్ టీవీ ప్రో ప్లాన్‌కి ఈ ప్లాన్లు అదనం. ఈ ప్లాన్‌ను టీవీ,మొబైల్, అంటే రెండు డివైజ్‌లలో యాక్సెస్ చేయొచ్చు. వీ మూవీస్ అండ్ టీవీ ప్రో ప్రీపెయిడ్ సబ్‌స్క్రిప్షన్ అదనంగా 5 జీబీ డేటాను కూడా అందిస్తుంది.

ఈ ఆఫర్లతో భారత్‌లో డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్ దిగ్గజాల్లో ఒకటిగా వీ తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకోనుంది. వ్యూహాత్మక భాగస్వామ్యాలు, విశిష్టమైన సబ్‌స్క్రిప్షన్ మోడల్స్‌ దన్నుతో యూజర్లకు మెరుగైన వీక్షణ అనుభూతిని అందించాలని వీ లక్ష్యంగా నిర్దేశించుకుంది.

Also read :Vi Movies & TV App Zee5 offers entertainment with access to 17 OTT apps vidudala new subscription plans