365తెలుగు డాట్ కామ్ ,ఆన్ లైన్ న్యూస్ ,ఏప్రిల్ 6,2021హైదరాబాద్: నిన్న తెలంగాణా నుంచి ఉత్తర తమిళనాడు వరకు 0.9 కి మీ వరకు ఉన్న ఉపరితల ద్రోణి ఈ రోజు బలహీన పడింది.ఇవాళ ఉపరితల ద్రోణి సముద్ర మట్టం నుండి 0.9కి మీ వరకు ఇంటీరియర్ తమిళనాడు నుండి ఇంటీరియర్ కర్నాటక మీదుగా మరత్వడా వరకు ఏర్పడింది.


తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడురోజుల్లో వాతావరణ సూచన
ఈ రోజు ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి వర్షం పశ్చిమ తెలంగాణా , నైరుతి తెలంగాణా లోని కొన్ని జిల్లాలలో ఒకటి రెండు ప్రదేశాలలో వచ్చే అవకాశం ఉంది. మిగతా జిల్లాలలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది .7,8వ. తేదీలలోపొడి వాతావరణము ఏర్పడే అవకాశం ఉంది. ఈ రోజు కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, నారాయణ్ పేట్ , వానపర్తి,జోగులాంబ గద్వాల్ మరియు నాగర్ కర్నూల్ జిల్లాలలో ఉరుములు మెరుపులతో పాటు తేలికపాటి వర్షములు వచ్చే అవకాశములు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం
సంచాలకులు తెలిపారు.