365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఆగస్టు 29,2024:అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం వాయుగుండంగా మారింది. ఈ వాయుగుండం త్వరలో తుఫాన్‌గా మారుతుందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. వచ్చే 24 గంటల్లో తుఫాన్ తీవ్రతను పెరుగుతుందని వాతావరణ శాఖా అధికారులు వెల్లడిస్తున్నారు.

ఈ వాయుగుండం, తుఫాన్‌గా మారితే, గుజరాత్, మహారాష్ట్ర కోస్తా, ఉత్తర ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ వర్షాల వల్ల ఉధృతమైన వరదలు, పంట నష్టాలు, ప్రజల జీవనశైలిలో పెద్ద మార్పులు సంభవించవచ్చని అధికారులు చెబుతున్నారు.
భారత వాతావరణ శాఖ ప్రజలను అప్రమత్తం అవ్వాలని సూచించింది. తుఫాన్ నేపథ్యంలో చేపట్టాల్సిన రక్షణచర్యలపై అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది. ముఖ్యంగా, సముద్ర ప్రాంతాల దగ్గరలో ఉన్నవారు, తీరప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని, అవసరమైన సమయంలో అక్కడి వారిని సహాయ కేంద్రాలకు తరలించాలని వాతావరణ శాఖ సూచించింది.

ఈ వాతావరణ మార్పులు వల్ల ఊహించని పరిణామాలు ఏర్పడవచ్చు కాబట్టి, స్థానిక ప్రభుత్వం, వాతావరణ శాఖ సూచనల్ని అందరూ సీరియస్‌గా తీసుకోవాలి.