365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, మార్చి11, 2022 : భారతీయ డాటా సెంటర్,క్లౌడ్ సేవల మార్కెట్‌లో అగ్రగామి సంస్ధ వెబ్ వెర్క్స్, ఓస్టాండలోన్ భవంతిని సొంతం చేసుకోవడంతో పాటుగా దానిని వాణిజ్య వ్యాపార జిల్లా హైదరాబాద్‌లో తమ మొట్టమొదటి డాటా సెంటర్‌గా మార్చింది. హైదరాబాద్ ఐటీ కారిడార్‌కు అతి సమీపంలో ఉండటం వల్ల అత్యంత ప్రసిద్ధి చెందిన వ్యాపార కేంద్రంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందింది. ఈ నూతన, అత్యున్నతంగా ఇంటర్‌కనెక్ట్ కాబడిన డాటా కేంద్రం 120,000 చదరపు అడుగుల కోలోకేషన్ ప్రాంగణం అందిస్తుంది. దీనికి 10ఎంవీఏ గ్రాస్ పవర్ సామర్థ్యం మద్దతు నందిస్తుంది. 6ఎండబ్ల్యు వరకూ ఐటీ లోడ్ దీనిపై ఉంటుందని అంచనా.
మొదటి దశ డెలివరీ 2022 నాల్గవత్రైమాసానికి పూర్తి కాగలదని అంచనా. ఈ అభివృద్ధి గురించి వెబ్‌వెర్క్స్ డాటా సెంటర్ సీఈవో నిఖిల్ రాఠీ మాట్లాడుతూ ‘‘ డాటా సెంటర్ల కోసం ప్రత్యేక విధానం కలిగిన తెలంగాణా కోసం, మాకు ఇది మరో ప్రతిష్టాత్మకమైన విస్తరణగా ఉంటుంది. హైటెక్ సిటీ ఇప్పడు హైపర్ స్కేలర్స్‌ను ఆకర్షించడంతో పాటుగా వైవిధ్యమైన వ్యాపారవేత్తలను సైతం అందిస్తుంది. వీరిలో ఐటీ, బయోటెక్, ఆర్థిక సంస్థలు, సేవా పరిశ్రమ ఉన్నాయి. మా డాటా సెంటర్ సదుపాయం, వినియోగదారులు వేగంగా తమ డిజిటల్ పరివర్తన వ్యూహాలను విస్తరించేందుకు తోడ్పడుతుంది. దీని కోసం అంతర్జాతీయ డాటా సెంటర్‌కు అవసరమైన మౌలిక సదుపాయాలు ఉన్నాయి.
ఇది కెపాసిటీ, క్లౌడ్,కనెక్టివిటీ అందిస్తుంది. వెబ్ వెర్క్స్,ఐరన్ మౌంటెన్ డాటా సెంటర్లు ఇప్పుడు ఇండియా, యుఎస్, యూరోప్ మరియు ఏపీఏసీ వ్యాప్తంగా 19కు పైగా సదుపాయాలను నిర్వహిస్తోంది. ఈ గ్లోబల్ డాటా సెంటర్ ప్లాట్‌ఫామ్‌పై మా వినియోగదారులు, తమ పరిసరాలు ,వినియోగదారులను,భాగస్వాములను సమర్థవంతంగా చేరుకోవడానికి వీలు కల్పించే పర్యావరణ వ్యవస్ధల ఎంపికను పొందగలరు. తద్వారా వ్యాపార పరంగా అర్ధవంతమైన వృద్ధినీ సాధించగలరు’’ అని అన్నారు.ఈ నూతన హైదరాబాద్ డెవలప్‌మెంట్ కేంద్రం భారతదేశంలో వెబ్‌వెర్క్స్ ఉనికిని బలోపేతం చేయగలదు. ‘‘భారతదేశంలో అతి పెద్ద డాటా సెంటర్ మార్కెట్ లలో హైదరాబాద్ ఒకటి. 2026 నాటికి ఇది తమ సామర్థ్యంను మూడు రెట్లు వృద్ధి చేయగలదు’’ అని మైఖేల్ గో, వీపీ అండ్ జీఎం, ఏపీఏసీ ఐరన్ మౌంటెయిన్ డాటా సెంటర్స్ అన్నారు.‘‘అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న మార్కెట్‌లో మా వినియోగ దారులకు అత్యున్నత సామర్థ్యం అందిస్తుండటం పట్ల ఐరన్ మౌంటెయిన్ డాటా సెంటర్స్ ఆనందంగా ఉంది‘‘ అని అన్నారు.
వెబ్‌వెర్క్స్ ప్రస్తుతం టియర్ 3 డాటా సెంటర్లను ముంబై, ఢిల్లీ ఎన్‌సీఆర్, పూణె లో నిర్వహిస్తోంది. రాబోతున్న సదుపాయాలలో 12.5 ఎంవీఏ స్టాండలోన్ డాటా సెంటర్ నవీ ముంబైలో రాబోతుంది. అలాగే బెంగళూరులో 10ఎంవీఏ స్టాండలో్‌న్ డాటా సెంటర్ రాబోతుంది.మా డాటా సెంటర్లు అన్నీ కూడా క్లౌడ్‌కు సిద్ధంగా ఉండటం వల్ల హైబ్రిడ్ ఐటీ వ్యూహాలు కలిగిన వినియోగదారుల అవసరాలను తీర్చ గలరు.