365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఫిబ్రవరి 4,2025: భారతదేశపు ప్రముఖ ప్రీమియం ఫ్లెక్సిబుల్ వర్క్‌స్పేస్ ఆపరేటర్‌గా పేరున్న ఉయ్‌వర్క్ ఇండియా మేనేజ్‌మెంట్ లిమిటెడ్ (WeWork India), తమ మొదటి పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీవో) కోసం మార్కెట్ నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ)కి ముసాయిదా ప్రాస్పెక్టస్ (డీఆర్‌హెచ్‌పీ)ను సమర్పించింది.
ఈ ఐపీవోలో భాగంగా, కంపెనీ 4,37,53,952 ఈక్విటీ షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) విధానంలో విక్రయించనుంది. ఇందులో 3,34,58,659 షేర్లను ఎంబసీ బిల్డ్‌కాన్ ఎల్ఎల్పీ (ప్రమోటర్ సెల్లింగ్ షేర్‌హోల్డర్),1,02,95,293 షేర్లను 1 ఏరియల్ వే టెనెంట్ లిమిటెడ్ (ఇన్వెస్టర్ సెల్లింగ్ షేర్‌హోల్డర్) విక్రయించనున్నారు.
ఈ అమ్మకాల ద్వారా పొందిన నిధులు కంపెనీకి దక్కవు.
ఉయ్‌వర్క్ ఇండియా, చిన్న, మధ్య, పెద్ద స్థాయి సంస్థలు, స్టార్టప్‌లు, వ్యక్తులందరికీ అధిక నాణ్యత కలిగిన ఫ్లెక్సిబుల్ వర్క్‌స్పేస్‌లను అందిస్తుంది. కంపెనీ క్లయింట్లలో ఫార్చూన్ 500 కంపెనీలు, అంతర్జాతీయ సంస్థలు, జీ సీ సీలు (GCCs) మరియు ఇతర ప్రముఖ బ్రాండ్లు కూడా ఉన్నాయి.
గత మూడు ఆర్థిక సంవత్సరాలుగా, ఉయ్‌వర్క్ ఇండియా మొత్తం ఆదాయ పరంగా దేశంలోని అతి పెద్ద ఫ్లెక్సిబుల్ వర్క్‌స్పేస్ ఆపరేటర్‌గా నిలిచింది.
ఈ ఇష్యూకి జేఎం ఫైనాన్షియల్ లిమిటెడ్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్ లిమిటెడ్, జెఫ్రీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, కోటక్ మహీంద్రా క్యాపిటల్ కంపెనీ లిమిటెడ్, 360 వన్ డబ్ల్యూఏఎం లిమిటెడ్ సంస్థలు బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా పనిచేస్తున్నాయి.