365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,డిసెంబర్ 25,2024 : యాపిల్ అనేది ఒక అమెరికన్ బహుళజాతి సాంకేతిక సంస్థ. ఇది1976లో ఏప్రిల్ 1వ తేదీన ప్రారంభమైంది. దీని వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్. ఆయన 2011లో మరణించారు. ఇది వినియోగదారు ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ అనేక రకాల ఆన్‌లైన్ సేవలను అభివృద్ధి చేస్తుంది యాపిల్ సంస్థ. విక్రయిస్తుంది. దాని ప్రసిద్ధ ఉత్పత్తులలో iPhone, iPad, Macintosh కంప్యూటర్, Apple వాచ్ అండ్ Apple TV వంటి ప్రోడక్ట్స్ ఉన్నాయి. యాపిల్‌లో 1,64,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. https://www.apple.com/

యాపిల్ సంపాదన..?

2023-24లో యాపిల్ దాదాపు 391 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 33 లక్షల కోట్లు) ఆర్జించింది. దాని ఆదాయాలు, అమ్మకాలలో అమెరికా సహకారం అత్యధికం (సుమారు 44 శాతం). ఐఫోన్‌లు, మ్యాక్‌బుక్‌లను విక్రయిస్తున్న యాపిల్ తన ఆదాయంలో దాదాపు 26 శాతం యూరోపియన్ దేశాల నుంచే సంపాదిస్తోంది. యాపిల్ మొత్తం వ్యాపారంలో చైనా సహకారం 17 శాతం కాగా, భారత్ సహకారం 2 శాతం.

https://www.apple.com/