Mon. Dec 23rd, 2024
hindenburg-researchAdani_

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ముంబై, జనవరి 27,2023: హిండెన్‌బర్గ్ రీసెర్చ్ అనేది ఈక్విటీ, క్రెడిట్ అండ్ డెరివేటివ్స్ మార్కెట్ డేటాను విశ్లేషించే ఫోరెన్సిక్ ఫైనాన్షియల్ రీసెర్చ్ సంస్థ.

దీనిని నాథన్ ఆండర్సన్ 2017లో స్థాపించారు. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ హెడ్జ్ ఫండ్ వ్యాపారాన్ని కూడా చేస్తుంది. కార్పొరేట్ కార్యకలాపాల గురించి బహిర్గతం చేయడంలో ఇది ప్రసిద్ధి చెందింది.

ఐతే ఇటీవల అదానీ గ్రూప్ పై ప్రతీకారం తీర్చుకుందనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అదానీ సంస్థ హెచ్చరించింది.

హిండెన్‌బర్గ్ నివేదిక విడుదలైన తర్వాత, అదానీ వాటాదారులు ,పెట్టుబడిదారులపై ప్రతికూల ప్రభావం పడింది.

hindenburg-researchAdani_

దీంతో అదానీ గ్రూప్ వ్యాపారానికి ఎదురుదెబ్బ తగిలింది. అదానీ గ్రూప్‌ లీగల్ హెడ్‌ జతిన్‌ జలంధ్వాలా మాట్లాడుతూ.. హిండెన్‌బర్గ్ నివేదిక కారణంగా భారత స్టాక్‌ మార్కెట్‌లో ఒడిదుడుకులు తలెత్తడం ఆందోళన కలిగిస్తోందన్నారు.

అదానీ గ్రూప్ షేర్ల పతనం వల్ల షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ లాభపడుతుందని జలుంద్వాలా ఓ ప్రకటన విడుదల చేశారు.

హిండెన్‌బర్గ్ తప్పుదారి పట్టించే నివేదికపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అదానీ గ్రూప్‌ లీగల్ హెడ్‌ జతిన్‌ జలంధ్వాలా తెలిపారు.

error: Content is protected !!