365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,ఫిబ్రవరి 21,2023: జర్నలిస్ట్ లకు సామాజిక స్పృహ చాలా అవసరం. అలాగే సామాజిక బాధ్యత, సామాజిక భద్రత అనేవి కూడా అవసరమే… అయితే ఇక్కడ సామాజిక స్పృహ అనేది ఉంటే చాలు. సామాజిక భాద్యత-భద్రత అనేవి కూడా దాదాపు సామాజిక స్పృహలో భాగంగానే ఉంటాయి.
సామాజిక స్పృహ అంటే ఏమిటి అనే అంశం పై మన జర్నలిస్ట్ ల కోసం చిన్న వివరణ.ఈ ప్రపంచంలో పలు రకాల సంస్కృతులు, ఆచార వ్యవహారాలు వంటివి ఎన్నో ఉన్నాయి. వీటిపై మన జర్నలిస్టులకు సాధ్యమైన మేరకు అవగాహన ఉండి తీరాలి.
లేదా కనీస అవగాహనైనా కలిగి ఉండాలి.అలాగే ఈ సమాజంలో వివిధ వర్గాల ప్రజలు వారి సమస్యలు ప్రాంతాలను బట్టి వారి ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాలు, వాటికి వాళ్లు ఇచ్చే విలువలు వంటి ప్రతి అంశాలపై మన జర్నలిస్టులు అవగాహన చేసుకోవాలి.

లేదా కొత్త ప్రాంతాలకు న్యూస్ కవరేజి కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న గ్రామ పెద్దలను కలసి వారి ఆచార వ్యవహారాలు, సిద్ధాంతాలు,వారి పద్ధ తులు,విలువలు వంటి ప్రతి అంశాన్ని వారి వద్ద నుంచి సమాధానాలు రాబట్టుకొని వాటికి విలువలు ఇస్తూ ఎటువంటి ఆటంకం,ఇబ్బందులు లేకుండా వార్తలను కవరు చేయాల్సినటువంటి అవసరం మన జర్నలిస్ట్ లు గమనంలో పెట్టు కోవాలి.
వీటిపై మన జర్నలిస్ట్ లకు కనీస అవగాహన లేని పక్షాన వార్త ప్రచురణ,ప్రసారం జరిగాక వార్త సేకరించిన జర్నలిస్టుకి, వార్తా ప్రచురణ చేసిన పత్రికకు ఏమైనా పొర పాట్లు జరిగి ఉంటే కొంత ఇబ్బందులు ఎదురవక తప్పదు.
అలాగే సున్నిత మైన అంశాలపై, న్యూస్ కవరేజి, ప్రచురణ, ప్రసారాల విషయంలో నిషేధాల పై కూడా అవగాహన కలిగి ఉండాలి. జర్నలిస్టు గా పనిచేస్తున్న ప్రాంతాలలో బడుగు-బలహీనవర్గాలకు చెందినటువంటి ప్రజలు ఉంటే… వారి సమస్యలు ఇబ్బందులు కనిపెడుతూ వారికి విద్యా-వైద్యం వంటి విషయాలతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తిస్తున్నాయా…?లేదా…?
వంటి విషయాలపై వాళ్ళు అర్హులై ఉంటే అటువంటి విషయాలు తీర్చాల్సిన అవసరం ప్రభుత్వాలకి ఉన్నట్లు గుర్తు చేస్తూ… ఆయా… ప్రజలకు ప్రభుత్వాలకు వారధిగా మన జర్నలిస్టులు విశ్వసనీయతతో పని చేసినప్పుడే సామాజిక స్పృహ అనేదానికి అర్ధం అని తెలుసుకోవాలి.
ఒక్క ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు మాత్రమే కాదు. సమాజంలో ప్రతి విషయం లో ఎదురయ్యే అవాంత రాలు,నష్టాలు,కష్టాలు ఏదైనా సరే సమాజం అనే పంటపొలానికి ఒక రైతుగా జర్నలిస్ట్ ఉంటే…దానికి అనుక్షణం మీడియా అనేది రక్షణ కవచంలా ఉంటుంది.
కాబట్టి జర్నలిస్ట్ కి సామా జిక స్పృహ అనేది చాలా అవసరం.ఈ సామాజిక స్పృహ లేని వ్యక్తులు జర్నలిస్ట్ లుగా ఉంటే…. పంట పొలానికి రక్షణగా ఉండాల్సిన “కంచె చేనుని మేసినట్లు” అని అర్ధం.ఒక రకంగా ఈనాటి మీడియా ఇలాగే ఉంది.

హోదాల కోసం జర్నలిజం వద్దు. ఇక్కడ కూడా చిన్న విషయం చెప్పుకుందాం.. గత రెండు దశాబ్దాలుగా జర్నలిజం ప్రతి ఒక్కరికి అందుబాటు లోకి వచ్చింది.
అలాగే జర్నలిజం పై ఆసక్తి ఉన్న ఎంతోమందికి జర్నలిజం కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇక జర్నలిజంలో డిప్లమో కోర్సులు, సర్టిఫికెట్ కోర్సులు అలాగే పలు యూనివర్సిటీలలో మాస్టర్ డిగ్రీలు, కొన్ని డిగ్రీ కళాశాల ల్లో జర్నలిజం డిగ్రీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
ఈ కోర్సులు ఎంత అందు బాటులోకి వచ్చినా… జర్నలిజంలో ఏ మాస్టర్ డిగ్రీలు,డాక్టరేట్ లు ఉన్నా… ప్రధానంగా జర్నలిస్ట్ కి కావాల్సిన ప్రత్యేకమైన అర్హత సామా జిక స్పృహ,సామాజిక బాధ్యత,సామాజిక భద్రత ఇవే ఓ జర్నలిస్ట్ కి ఉండాల్సిన లక్షణాలు.
జర్నలిస్టు అనే వ్యక్తి మీడియా అనే ఏ ఫ్లాట్ ఫామ్ పై పని చేసినా…. పలు రకాలుగా వార్తలు సేకరించాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఏ సంస్థల్లో అయినా, ఏ వివాదాలలో అయినా, ఏ రంగంలోనైనా… వార్తలు సేకరించినప్పుడు జర్నలిస్ట్ నిష్పక్షపాతంగా నిజాలను వెలికి తీసి నిజాలను నిర్భయంగా వార్తగా రాయగలిగిన వాడే నిజమైన జర్నలిస్టు.
ఒక వ్యక్తి నిజమైన జర్నలిస్టుగా గుర్తింపు పొందాలంటే మనం చెప్పుకుంటు న్న సామాజిక స్పృహ, సామాజిక బాధ్యత, సామాజిక భద్రత ఈ మూడు అంశాలలో జర్నలిస్టు మంచిగా ఆలోచించి ఒక వార్త గాని వార్త కథనం గాని చక్కగా డ్రాప్టింగ్ లేదా వీడియో రూపంలో ప్రజాక్షేత్రంలోకి తీసుకెళ్లగలిగితే చూసిన పాఠకులు, టీవీ ప్రేక్షకులు ఆ వార్త కథనం ఫైల్ చేసిన వ్యక్తులపై గౌరవం కలిగి ఉంటారు. అలాగే ఒక మంచి జర్నలిస్టుగా గుర్తించటం జరుగుతుంది.
ఇక నేర వార్తలు విషయం లో ప్రధానంగా మహిళలు, మైనర్ బాలికలు,మైనర్ పిల్లలు ఎవరైనా… అత్యా చారాలకు,ఇతర నేరాలకు గురైనా/చేసినా అటువంటి వార్తలు కవరేజ్ విషయం లో కొన్ని నిబంధనలు జర్నలిస్ట్ లు పాటించాలి. జర్నలిస్టులు ఎవరైనా సరే…ఆయా నిబంధనలను తప్పకుండా పాటించాలి.

న్యూస్ ఆధారాల కోసం ఫోటోలు,వీడియో విజువల్స్ అవసరమైతే పత్రికలలో గాని టీవీలలో గాని ప్రచురణ,ప్రసారం చేయాల్సి వచ్చినప్పుడు ఆయా ఫోటోలపై వీడియో విజువల్స్ పై బాధితుల ముఖాలపై కనిపించ కుండా,ఎవరూ గుర్తుపట్ట కుండా ‘బ్లర్’ చేసే విధంగా వాటిని ప్రదర్శించే అవకాశం ఉంది.
ఇది కూడా సామాజిక బాధ్యత,భద్రత కల్పించడమే. అలాగే బాధితుల పేర్లు,వివరాలు బహిర్గతం చేయకూడదు. దానికి చట్టాలు ఉన్నాయి. మొదట చెప్పినట్లు మనం పనిచేస్తున్న ప్రాంతాలలో కూడా ఆయా కులాలు, మతాలు, వర్గాలు ప్రజలు ఉంటారు.వారికంటూ కొన్ని ఆచార వ్యవహారాలు ఉంటాయి.
వాటిని మనం ఎప్పుడూ కూడా తుష్కారం గా మాట్లాడటం, అప హాస్యం చేయటం వంటివి చేయరాదు. మొత్తానికి జర్నలిస్టు అనేవారికి సామాజిక స్పృహ అనేది ఈ విధంగా ఉండాలి.
అలాగే సామాజిక బాధ్యత మనం పని చేస్తున్న ప్రాంతంలో ఎవరికైనా ఇబ్బందులు కలిగి బ్రతుకు భారమైన సమయంలో జర్నలిస్టులుగా మనం ఏమి చేయలేకపోయినా సామాజిక బాధ్యత వహిస్తూ వారు ఇబ్బంది పడుతున్న విషయం ఏదైనా… మనం చేయ గలిగినది ఏదో చేసి తీరాలి.
అంటే మనం పెద్దగా చేయగలిగింది ఏమీ లేక పోయినా కనీసం మన కలంతో ఓ కథనం రాసి ప్రజాక్షేత్రంలోకి తీసికెళితే..అదే మనం చేసే బాధ్యత. అలాగే సామాజిక భద్రత అంటే ఇక్కడ కూడా మనం పెద్దగా చేయగలిగింది ఏమీ లేకపోయినా ప్రకృతి వైపరీత్యాలు,అనుకోని ప్రమాదాలు ఏమైనా జరిగినప్పుడు ప్రధానంగా సమాచారపరంగా ఆ విషయాలు ముందు మనకే తెలుస్తాయి.
అటువంటి సమయంలో మనం స్పందించి, ప్రమాద పరిస్థితిని ప్రజలకు ప్రభుత్వానికి వారదుల మైన మనం తప్పనిసరిగా మీడియాకు చెందిన వ్యక్తులుగా మనం వారిపై అక్కడ వారు ఎదుర్కొం టున్న సమస్యలను కథనం రూపంలో రాసి ప్రచురించ గలిగితే చాలు మన కధనాలు చూసి సంబంధిత అధికారులు కనీస చర్యలు చేపట్టినా చాలు.
అదే మనం కల్పించే సామాజిక భద్రత.ఎలా చూసినా కూడా మనం సమాజంపై సామాజిక స్పృహ, సామాజిక భద్రత, సామాజిక బాధ్యత, కలిగి ఉండాలి ఇక మన రంగంలోకి కొత్తగా వచ్చే వారి కోసం మీడియా సంస్థలు విలేకరులు కావలెను అని ఇచ్చే ప్రకటనలో ప్రధానంగా మనకు కనిపించే అంశం సామాజిక స్పృహ కలిగి ఉండాలి.

నిజాన్ని నిర్భయంగా రాయగలిగి ఉండాలి అనేవి మాత్రమే జర్నలిజానికి అర్హతగా ప్రకటనలు ఇస్తున్నారు. కాబట్టి సామాజిక స్పృహ అనేది జర్నలిస్టులకు ఎంత అవసరమో మన జర్నలిస్టు లు తెలుసుకొని తీరాలి. ఇప్పటివరకు జర్నలిజంలో సామాజిక స్పృహ, సామాజిక బాధ్యత, సామాజిక భద్రతతో విలువలతో పనిచేసిన ఎంతో మంది జర్నలిస్టులు కొనసాగారు.
ప్రస్తుతం మీడియా పరిస్థితి పూర్తిగా మారిపోయింది.సామాజిక స్పృహ,బాధ్యత,భద్రత కల్పించే వారు ఎవరు జర్నలిజంలో పెద్దగా కనిపించటం లేదు. సమాజం మీద పడి ఎలా బెదిరించాలి, ఎలా దోచుకోవాలి,ఏ విధంగా లబ్ధి పొందాలి అనే ఆలోచనలోనే ఉంది ప్రస్తుత మీడియా రంగం.
ప్రకటనల కోసం,ప్రచారాల కోసం పత్రిక/టీవీ లలో ఎంత స్పేస్ కావాలో… అంత స్పేస్ కల్పిఎంచుకునే మీడియా సంస్థలు జర్నలిస్ట్ లు సామాజిక స్పృహతో ఏదైనా మంచి కధనం అందిస్తే స్పేస్ లేదని జర్నలిస్ట్ లకు మొండిచేయి చూపించే కొన్ని మీడియా సంస్థలు ఉన్నాయి.
ప్రస్తుతం ఈ మీడియా సంస్థలు కూడా విలువలు లేని జర్నలిస్ట్ లను పెట్టుకుని సమాజానికి చీడ పట్టినట్లు పట్టి నీకు కొంత నాకు కొంత అనే విధంగా మీడియా మనుగడ సాగిస్తుంది.
పేరుకే విలేకరులు కావలెను అను ప్రకటనల్లో నిజాలను నిర్భయంగా రాయాలి,సామాజిక స్పృహ కలిగి ఉండాలి అనేవి.నిజాలు నిర్భయం గా రాసే జర్నలిస్ట్ లు, సామాజిక స్పృహ కలిగిన జర్నలిస్ట్ లు ఎందరో ఉన్నారు.
నిజాలు నిర్భయంగా.. సామాజిక స్పృహతో మన జర్నలిస్ట్ లు రాసే కథనాలను ప్రచురణ,ప్రసారం చేసే మీడియా సంస్థలు ఈ ప్రజాక్షేత్రంలో ఏ మూలన దాగి ఉన్నాయో.. మరి. అలా ఉండి ఉంటే.. ఇదిగో నేనున్నా….అని ముందుకు రావాలి..
ఆ దమ్ము ఉన్న మీడియా సంస్థలు ఎక్కడ ఉన్నాయో… కూడా వెతికి పట్టుకోవాలి. కనీసం మన జర్నలిస్ట్ లు అయినా జర్నలిజంలో విలువలు కోసం సామాజిక స్పృహ, భాద్యత,భద్రత లను కాపాడాలి.
అదే మనం కల్పించే సామాజిక భద్రత.ఎలా చూసినా కూడా మనం సమాజంపై సామాజిక స్పృహ, సామాజిక భద్రత, సామాజిక బాధ్యత, కలిగి ఉండాలి ఇక మన రంగంలోకి కొత్తగా వచ్చే వారి కోసం మీడియా సంస్థలు విలేకరులు కావలెను అని ఇచ్చే ప్రకటనలో ప్రధానంగా మనకు కనిపించే అంశం సామాజిక స్పృహ కలిగి ఉండాలి.
నిజాన్ని నిర్భయంగా రాయగలిగి ఉండాలి అనేవి మాత్రమే జర్నలిజానికి అర్హతగా ప్రకటనలు ఇస్తున్నారు. కాబట్టి సామాజిక స్పృహ అనేది జర్నలిస్టులకు ఎంత అవసరమో మన జర్నలిస్టు లు తెలుసుకొని తీరాలి. ఇప్పటివరకు జర్నలిజంలో సామాజిక స్పృహ, సామాజిక బాధ్యత, సామాజిక భద్రతతో విలువలతో పనిచేసిన ఎంతో మంది జర్నలిస్టులు కొనసాగారు.
ప్రస్తుతం మీడియా పరిస్థితి పూర్తిగా మారిపోయింది.సామాజిక స్పృహ,బాధ్యత,భద్రత కల్పించే వారు ఎవరు జర్నలిజంలో పెద్దగా కనిపించటం లేదు. సమాజం మీద పడి ఎలా బెదిరించాలి, ఎలా దోచుకోవాలి,ఏ విధంగా లబ్ధి పొందాలి అనే ఆలోచనలోనే ఉంది ప్రస్తుత మీడియా రంగం.

ప్రకటనల కోసం,ప్రచారాల కోసం పత్రిక,టీవీ లలో ఎంత స్పేస్ కావాలో… అంత స్పేస్ కల్పిఎంచుకునే మీడియా సంస్థలు జర్నలిస్ట్ లు సామాజిక స్పృహతో ఏదైనా మంచి కధనం అందిస్తే స్పేస్ లేదని జర్నలిస్ట్ లకు మొండిచేయి చూపించే కొన్ని మీడియా సంస్థలు ఉన్నాయి.
ప్రస్తుతం ఈ మీడియా సంస్థలు కూడా విలువలు లేని జర్నలిస్ట్ లను పెట్టుకుని సమాజానికి చీడ పట్టినట్లు పట్టి నీకు కొంత నాకు కొంత అనే విధంగా మీడియా మనుగడ సాగిస్తుంది.
పేరుకే విలేకరులు కావలెను అను ప్రకటనల్లో నిజాలను నిర్భయంగా రాయాలి,సామాజిక స్పృహ కలిగి ఉండాలి అనేవి.నిజాలు నిర్భయం గా రాసే జర్నలిస్ట్ లు, సామాజిక స్పృహ కలిగిన జర్నలిస్ట్ లు ఎందరో ఉన్నారు.నిజాలు నిర్భయంగా.. సామాజిక స్పృహతో మన జర్నలిస్ట్ లు రాసే కథనాలను ప్రచురణ,ప్రసారం చేసే మీడియా సంస్థలు ఈ ప్రజాక్షేత్రంలో ఏ మూలన దాగి ఉన్నాయో…. మరి.
అలా ఉండి ఉంటే…ఇదిగో నేనున్నా….అని ముందుకు రావాలి ఆ దమ్ము ఉన్న మీడియా సంస్థలు ఎక్కడ ఉన్నాయో… కూడా వెతికి పట్టుకోవాలి. కనీసం మన జర్నలిస్ట్ లు అయినా జర్నలిజంలో విలువలు కోసం సామాజిక స్పృహ, బాధ్యత,భద్రత లను కాపాడాలి.
నోట్:ఫోటో రైటప్:

- ఈ కథనానికి చెందిన పై ఫోటోను పరిశీలించండి. ఓ అనాధ బాలుడు ఆకలికి అలమటీంచి… ఆకలి తీర్చుకునే అవకాశం లేక,ఆదరించే వారు దూరమై విలువలు లేని మనుషులు నివసిస్తున్న ఈ సమాజంలో… మనుషుల కన్నా… జంతువులే మేలు, అని గ్రహించిన ఓ పసి బాలుడు.ఓ.. నడిరాత్రి వేళ చలిలో కుక్కను తోడుగా పెట్టుకుని,రోడ్డు ప్రక్క దుప్పటి ముసుగు లో నిద్రిస్తున్నాడు.
- వీడికి ఎవరు ఆసరా…? ఆ ఆసరా…ఎవరంటే ఒకే ఒక్కడు వాడే జర్నలిస్ట్. సామాజిక స్పృహతో ఒకఫోటో, సామాజిక బాధ్యతతో మీడియాలో ఓ కధనం…అంతే కదిలి వచ్చిన ప్రభుత్వ యంత్రాంగం ఆ బాలుడి జీవితానికి భద్రత కల్పియించింది అదీ జర్నలిస్ట్ అంటే….అదీ విలువలు కలిగిన జర్నలిస్ట్ ‘కలం’ పవర్.
- -ఈపూరి రాజారత్నం,సీనియర్ జర్నలిస్ట్, 9390062078.
