Sun. Dec 22nd, 2024
sugar-precautions

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్,డిసెంబర్ 12,2022: మధుమేహం పెరగడానికి స్థూలకాయం ఒకటి. స్థూలకాయం, బరువు పెరగడం టైప్ 2 డయాబెటిస్‌కు పూర్వగాములు కాబట్టి, ఆరోగ్యకరమైన బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ)ని నిర్వహించడం చాలా అవసరం, తద్వారా శరీరంలో ఉత్పత్తి చేసిన ఇన్సులిన్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి, తగ్గించడానికి సమర్థవంతంగా ఉపయోగించడం వీలవుతుంది.

ప్రతి వ్యక్తి, వారి బరువుతో సంబంధం లేకుండా, వారానికి 150 నుంచి 300 నిమిషాల పాటు సిఫార్సు చేసిన సమయంలో ప్రతిరోజూ కొంతమేర శారీరక శ్రమ చేయాలి. అందుకు వారు వ్యాయామశాలకు వెళ్లవచ్చు లేదా అది సాధ్యం కాకపోతే, నడక, జాగింగ్ ,స్విమ్మింగ్ వంటి వాటికీ సమయాన్ని కేటాయించాల్సి ఉంటుంది.

sugar-precautions

వాస్తవానికి, రోజువారీ శారీరక శ్రమ ఒక వ్యక్తి రక్తంలో చక్కెర స్థాయిలను సానుకూలంగా ప్రభావితం చేస్తుంది. 5-7శాతం బరువు తగ్గడం కూడా మధుమేహాన్ని నియంత్రణలోకి తీసుకురావడంలో సానుకూల పాత్ర పోషిస్తుంది.

error: Content is protected !!