365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఏప్రిల్ 7,2024: ఈ జీవితంలో కోరుకున్నకోరికలు తీరక పోవటం. కోరని(మంచి చెడు) కోర్కెలు మనం అనుభవించడం ఎందుకు ఇలా జరుగుతుంది..? ఇలా జీవిస్తున్నాము కనుకనే మనిషి ఆనందంగా లేను అనే అనుభూతిలో ఉన్నాడు. దీనికి కారణం మనం చేసుకున్న కర్మలనే మన పెద్దలు కచ్చితంగా చెప్పారు.
ఈ కర్మలు మంచి కర్మలు గా మారి మనిషి ఆనందంగా జీవించాలి అంటే ఏమి చేయాలి.? దీనికి పెద్దలు చెప్పింది మనకు తెలిసి తెలియక పూర్వజన్మలలో చేసిన మంచి చెడు పనుల ఫలితాలు మన వెంట కొన్ని జన్మలుగా వస్తున్నాయి. ఈ కర్మల ఫలితాలు మంచివైతే మంచిగా చెడు అయితే చెడుగా జీవితంలో అనుభవించాల్సిందే.
వచ్చే జన్మలో కూడా ఇలాగే ఉంటుందా అంటే పూర్వ జన్మలో చేసిన మంచి-చెడు కర్మల ఫలం కొంత, ఈ జన్మలో చేసిన కర్మఫలం ఇంకొంత కలిసి వచ్చేదే “మరో జన్మ”.
మనసుకు సంతోషంగా శరీరానికి సుఖంగా ఉంటేనే ఆనందంగా ఉన్నట్టు. ఈ జీవితంలో ఆనందంగా వచ్చే జన్మలో ఇంకా ఆనందంగా మహా భాగ్యంగా జీవిద్దాం అని ఆశిస్తే, అందుకు విశాల హృదయంతో అందరినీ సమదృష్టితో చూస్తూ..
-ఏమీ ఆశించకుండా మనకు ఉన్న దాంట్లో వీలైనంత పరోపకారం చేయడం.
-ఇతరులకు సేవ చేయటం.
-భగవంతున్ని ధ్యానించడం.
ఈ యుగములో ఇవే మోక్ష మార్గానికి సోపానాలు. ఒక్కొక్క యుగం లో ఆ యుగధర్మలు ఉంటాయి.
ఉదా :- సత్యయుగము, ద్వాపర యుగము, త్రేతాయుగం, కలియుగము. ఏ యుగంలో ఆ యుగధర్మమే పాటించాలి. అలా కాదని మన మనసుకు నచ్చింది అని మనకు అనుకూలంగా ఉన్నదని ఆ యుగ ధర్మము ఈ కలియుగంలో పాటిస్తాను అంటే అంత ఫలితం మాత్రం వచ్చే అవకాశమే లేదు అని పెద్దలు చెప్పారు. ఈ కలియుగ ధర్మమే ఈ యుగంలో పాటించాలి.
ఈ యుగంలో నరుడే నారాయణుడు. ప్రతి మనిషిలో భగవంతుని అంశ ఉంటుంది. కాకపోతే కొందరు మాయచేత కప్పబడి ఈ కర్మలు అంటించుకుని రకరకాలుగా జీవిస్తున్నారు. కావున ఈ యుగ ధర్మం ప్రకారం మనం ఏ కర్మలు చేస్తే అదే తిరిగి అనేక రెట్లు పొందుతారు.
ఉదా :- మామిడి విత్తు విత్తితే మామిడి ఫలాలే..
నేరేడు విత్తు విత్తితె నేరేడు ఫలాలే అనేక రెట్లు తిరిగి ఎలా పొందుతామో..అలాగే మనం చేసే మంచి-చెడు కర్మల ఫలితం అనేక రెట్లు తిరిగి వస్తుంది. ఇదే ప్రకృతి ధర్మం. కావున మనము ప్రకృతి సిద్ధంగా జీవిస్తూ, కచ్చితంగా తిరిగి కొంత ప్రకృతికి ఇవ్వాల్సిందే. ఈ జీవితం, ఇప్పుడు అనుభవిస్తున్న స్థితి మొత్తం కూడా పోయిన జన్మలో చేసిన కర్మల పుణ్యంఫలితమే.
ఈ యుగంలో పరోపకారం( పరులకు ఉపకారం) చేస్తేనే పుణ్యం వస్తుంది. పుణ్యం ఉంటేనే ప్రకృతి మనకు అన్నీ సమకూరుస్తుంది. ప్రకృతి సిద్ధంగా జీవించటం అంటే ఆకలి వేసే సమయానికి ఆహారం దొరకాలి, దొరికిన ఆహారం మన చేతులతో నోటి వరకు వెళ్లాలి, అలా వెళ్లిన ఆహారం గొంతు నుండి పొట్టలో కి వెళ్ళాలి, అప్పుడది జీర్ణం కావాలి, అలా జీర్ణమైన దానిని శరీరం గ్రహించి శక్తి గా మార్చాలి, శక్తిగా మారి మిగిలింది దానంతటదే బయటికి విసర్జీంపబడాలి, ఇంతే కాక మన చుట్టూ పరిస్థితులు ఆందోళన అలజడి లేకుండా ఉండాలి. కుటుంబం లోని వ్యక్తులు వారి ఆరోగ్యం, వారి స్థితి అన్నీ కలిపితేనే ప్రకృతిసిద్ధంగా జీవిస్తున్నట్టు.
అలా జీవించిన వాడే ఐశ్వర్యవంతుడు. ఇందులో ఏ లోపం ఉన్నా అతను ఎంత ధనవంతుడైన ఐశ్వర్యవంతుడు మాత్రం కాలేడు. ధనవంతుడు అయితే కొండ మీది కోతి కొనవచ్చు ఏమోకానీ, ఐశ్వర్యవంతుడు మాత్రం కాలేడు.
ఈ కలియుగంలో ఆ విధంగా ఏ లోపాలు లేకుండా జీవించాలంటే కచ్చితంగా భగవత్ ధ్యానం,సేవా కార్యక్రమాలు, దానం (ధానం ఎలా చేయాలంటే కుచేలుడు శ్రీ కృష్ణునికి ఉన్న దానిలో ఉత్తమంగా చేసినట్లు) చేయాలి.దీనినే “పరోపకారం” అంటారు.
పరోపకారం అంటే ఏదో ఒక రోజు చేసి చాలా చేశాం అని అనుకోవడం కాదు. ఈ ప్రకృతిలో జీవించినంత కాలం ఈ ప్రకృతికి తిరిగి చేయాల్సిందే అందులో సందేహమే లేదు.
అలా ప్రకృతి సిద్ధంగా జీవించలేని ఎందరో ధనవంతులని మన కళ్ళతో మనం చూస్తున్నాం.అందుకే మనం అలా జీవించకుండా జాగ్రత్తపడి వచ్చే మంచి జన్మకు ఈ జన్మలోనే పునాది వేద్దాం. -భువనగిరి కిషన్, ప్రముఖ యోగా నిపుణులు..
ఇది కూడా చదవండి: World Health Day : ఒత్తిడిని దూరం చేసే ఆహారాలు..
ఇది కూడా చదవండి: World Health Day 2024: ఈ వ్యాయామాలతో వృద్ధాప్యం దూరం
ఇది కూడా చదవండి: అదితి రావు హైదరీతో నిశ్చితార్థంపై పెదవి విప్పిన సిద్ధార్థ్..
Also Read.. Ulaganayagan Kamal Haasan’s Bharateeyudu2 (Indian 2) box office attack in June
ఇది కూడా చదవండి: ఇండియన్-2 విడుదల తేదీ ఫిక్స్.. ఎప్పుడంటే..?
Also read: 9M Fertility by Ankura Hospital Rede fines Success, and Embraces Growth in the Last one year..
ఇది కూడా చదవండి: భారతదేశ ఎన్నికల అంతరాయం కోసం AIని ఉపయోగిస్తున్న చైనా ఆధారిత హ్యాకర్లకు మైక్రోసాఫ్ట్ హెచ్చరిక..
ఇది కూడా చదవండి: మొదటిసారిగా ఆవు నుంచి మనిషికి సోకిన బర్డ్ ఫ్లూ..
ఇది కూడా చదవండి: తొమ్మిది మంది మత్స్యకారులను రక్షించిన ఇండియన్ కోస్ట్ గార్డ్.