365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, డిసెంబర్ 2,2022:మెటా యాజమాన్యంలోని మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ Android బీటాలో డిజపీరింగ్ మెసేజ్ షార్ట్ కట్ ఫీచర్ ను ప్రారంభించింది. ఆండ్రాయిడ్ 2.22.25.11అప్‌డేట్ కోసం తాజా WhatsApp బీటాను డౌన్‌లోడ్ చేసిన తర్వాత, కొంతమంది వినియోగదారులు కొత్త ఫీచర్‌ను యాక్సెస్ చేసుకోవచ్చు.
న్యూ షార్ట్ కట్ ‘మేనేజ్ స్టోరేజ్’ విభాగంలో ఉంది. స్పేస్ సేవర్ టూల్ గా పనిచేయనుంది. ఈ న్యూ షార్ట్ కట్ రాబోయే రోజుల్లో మరింత మంది వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. కొత్త విభాగం పాత , కొత్త చాట్‌లను డిజపీరింగ్ థ్రెడ్‌లుగా గుర్తించడాన్ని సులభతరం చేస్తుంది.
నిర్దిష్ట సమయం తర్వాత మీడియాను ఆటోమేటిక్ గా తొలగించడానికి వినియోగదారులు అదృశ్యమవుతున్న సందేశాలను కూడా ఉపయోగించ వచ్చట.
నవంబర్ నెలలో మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ WhatsApp ఐదు దేశాలలో ఎల్లో పేజెస్ తరహా వ్యాపార డైరెక్టరీని ప్రారంభించింది. ఈ ఫీచర్ బ్రెజిల్ యూకే, ఇండోనేషియా, మెక్సికో, కొలంబియా అంతటా అందుబాటులోకి వచ్చింది.
కొత్త ఫీచర్ వినియోగదారులకు సేవలో సంప్రదించదగిన కంపెనీలను కనుగొనడానికి నేరుగా శోధించడానికి లేదా ప్రయాణం లేదా బ్యాంకింగ్ వంటి వ్యాపారాలను గురించి తెలుసుకునేందుకు బ్రౌజ్ చేయడానికి సహాయపడుతుంది.