Thu. Dec 12th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, జూలై 20,2023: వాట్సాప్ సర్వీస్ నిలిచిపోయిన అరగంట తర్వాత కంపెనీ దాన్ని మళ్లీ పునరుద్ధరించింది. పునరుద్ధరణ గురించి సమాచారం ఇస్తూ, WhatsApp హ్యాపీ చాటింగ్ అని తెలిపింది. 30 నిమిషాల పాటు సేవలను నిలిపివేసినట్లు వాట్సాప్ ట్వీట్ చేసింది. కనెక్టివిటీ సమస్యలను పరిష్కరించడానికి తాము వేగంగా పని చేస్తున్నామని వెల్లడించింది.

వాట్సాప్ ట్వీట్..

బుధవారం అర్థరాత్రి వాట్సాప్ సేవలకు అకస్మాత్తుగా అంతరాయం ఏర్పడింది. ఈ మేరకు వాట్సాప్ ట్వీట్ ద్వారా సమాచారం ఇచ్చింది. 30 నిమిషాల పాటు సేవలను నిలిపివేసినట్లు కంపెనీ తెలిపింది. కనెక్టివిటీ సమస్యలను పరిష్కరించడానికి మేము వేగంగా పని చేస్తున్నాము. అయితే, కొంతకాలం తర్వాత కంపెనీ మరో ట్వీట్ చేసి మేము తిరిగి సేవలను అందించాము హ్యాపీ చాటింగ్ “అని తెలిపింది.

భారతదేశంలోనేకాకుండా విదేశాల వినియోగదారులు వాట్సాప్ లో సమస్యలను ఎదుర్కొన్నారు. అకస్మాత్తుగా వాట్సాప్ డౌన్ కావడంతో జనం ఉలిక్కిపడ్డారు. దీంతో దేశ, విదేశాలకు చెందిన వినియోగదారులు ఇబ్బందులు పడ్డారు. వాట్సాప్‌లో ఫోటోలు , వీడియోలను పంపడంలో, సందేశాలు పంపడంలో కూడా సమస్య తలెత్తినట్లు వినియోగదారులు చెప్పారు.

భారతదేశంలోని చాలా నగరాల్లో వాట్సాప్ పనిచేయ లేదు. వాట్సాప్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగదారులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. వాట్సాప్ డౌన్ ఫిర్యాదుల్లో ఎక్కువ భాగం రాజధాని న్యూఢిల్లీ, ముంబై , బెంగళూరు వంటి ప్రధాన నగరాల నుంచి వచ్చాయి. భారత్‌తో పాటు అమెరికా, యూకే, బ్రెజిల్‌లో కూడా వాట్సాప్ సమస్యలు తలెత్తాయి.

error: Content is protected !!