Mon. Dec 23rd, 2024
Muskmelon_365

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్ ,హైదరాబాద్,ఏప్రిల్ 10,2023:ఈ వేసవి కాలంలో ఖర్భుజా ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. ముఖ్యంగా ఇందులో ఉండే పోషకపదార్థాలు మలబద్ధకం, మూత్రాశయ ఇన్ఫెక్షన్లు, అల్సర్లు వంటి సమస్యలను నివారిస్తాయి.

ఇంతటి ఆరోగ్య ప్రయోజనాలున్న ఖర్భుజా పండును కొనేటప్పుడు కొన్ని గుర్తులు చూసి కొనాలి..? లేదంటే మోసపోవాల్సి వస్తుంది. అసలు ఖర్భుజా కొనేటప్పుడు ఎలాంటి బండగుర్తులు చూసి కొనాలో ఇప్పుడు తెలుసుకుందాం..

ఖర్భుజా తినడంవల్ల జీర్ణ సంబంధిత సమస్యలు రావు. అంతేకాదు రక్తపోటును కంట్రోల్లో ఉంచడంలో ఎంతగానో ఉపకరి స్తుంది. ఖర్భుజా లో కేలరీలు తక్కువగా ఉంటాయి.

Muskmelon_365

ఇందులో చర్మానికి, కంటికి మేలుచేసే విటమిన్ “ఏ” ఉంటుంది. గ్లైసెమిక్ ఇండెక్స్‌ తక్కువగా ఉంటుంది కాబట్టి చిన్నారుల నుంచి వృద్ధుల వరకు అందరూ తినొచ్చు.

వేసవి కాలంలో ముఖ్యంగా కర్బూజ తినడం, జ్యూస్ తాగడం ఆరోగ్యానికి చాలామంచిది. ఇది రుచిగా ఉండటంతో పాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కర్బూజాలో నీరు, పీచు పుష్కలంగా ఉంటుంది.

వేసవిలో ఇది శరీరాన్నిచల్లగా ఉంచుతుంది. దీంతోపాటు ఇది యాంటీ ఆక్సిడెంట్లకు మంచి మూలం. ఇందులో దాదాపు 90 శాతం నీరు ఉంటుంది.

Muskmelon_365

ఖర్భుజా సైజును బట్టి కాకుండా దాని లక్షణాలను గమనించి మంచిదా ..? కాదా..? తెలుసుకోవచ్చు. రుచికి దాని ప‌రిమాణానికి అసలు సంబంధం ఉండదు. కాయ ఏ సైజ్‌లో ఉన్నా స‌రే.. ప‌ట్టుకున్న‌ప్పుడు బ‌రువుగా అనిపించాలి. అలా బ‌రువుగా ఉంటే కాయలోప‌ల నీళ్లు, గుజ్జు ఎక్కువ‌గా ఉన్నట్లు గుర్తించాలి.

అందుకే ఎప్పుడూ సాధార‌ణ సైజ్‌లో ఎక్కువ బ‌రువు ఉన్న కాయ‌ల‌నే ఎంచుకోవాలి. చాలామంది తెల్లగా క‌నిపించే ఖర్భుజాలను కొంటుంటారు. అవి తాజాగా ఉంటాయ‌ని అనుకుంటారు. కానీ అలాంటి కాయ‌లు పూర్తిగా పండ‌క‌పోవడం వల్ల.. చ‌ప్ప‌గా అనిపిస్తుంటాయి.

Muskmelon_365

పూర్తిగా పండిన ఖర్భుజాకాయ ముదురు గోధుమ రంగులో ఉంటుంది. అలాంటి కాయ‌లే రుచిగా ఉంటాయి. అయితే బాగా పండినప్పుడు ఈ కాయను పట్టుకుంటే గట్టిగా ఉంటుంది. మెత్తగా ఉంటే ఎక్కువగా పండినట్లు అర్థం చేసుకోవాలి.

మరింతగా పండితే అంతగా టేస్ట్ ఉండదు. అంతేకాదు లోపల ఒక్కోసారి కుళ్లిపోయి ఉంటుంది. దోస జాతికి చెందిన కర్బూజాలో ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది అతిగా తినడాన్ని నిరోధించి కడుపు నిండుగా ఉండేలా చేస్తుంది.

కర్బూజ కాయలో విటమిన్ “కె”, నియాసిన్, కోలిన్, కాల్షియం, మెగ్నీషి యం, ఫాస్పరస్, జింక్, రాగి, మాంగనీస్,సెలీనియం మొదలైన అనేక విటమిన్లు ఖనిజాలు ఉన్నాయి. ఖర్భుజా కాయ కొనేటప్పుడు ఈ లక్షణాలు న్నాయోలేదో చూసుకొని కొనాలి..లేకపోతే మోసపోవాల్సి వస్తుంది జరా జాగ్రత్త.

error: Content is protected !!