Fri. Jan 3rd, 2025

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఇండియా ,ఏప్రిల్ 1,2022:వర్ల్‌పూల్ కార్పొరేషన్ అనుబంధ సంస్థ వర్ల్‌పూల్ ఆఫ్ ఇండియా సరికొత్త నియో ఫ్రెష్ గ్లాస్‌డోర్ ఫ్రాస్ట్-ఫ్రీ రిఫ్రిజిరేటర్ల శ్రేణిని అందిస్తోంది. భారతీయ గృహాల కోసం ఎంతో నైపుణ్యంగా రూపొందించిన ఈ రిఫ్రిజిరేటర్ ఒక సౌందర్య రూపం. డిజైన్‌లో వర్ల్‌పూల్ ఆధిపత్యాన్ని, అత్యాధునిక సాంకేతికతను ఇది చాటి చెప్తుంది. జీవనశైలికి పొడిగింపులా ఉండే ఆకర్షణీయమైన, స్టైలిష్‌ రిఫ్రిజిరేటర్లకు పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా ఈ ఫ్రాస్ట్‌ ఫ్రీ రేంజ్‌ డిజైన్‌ చేయడం జరిగింది.

డిజైన్, ఆకర్షణ, ఆవిష్కరణ, సాంకేతికత సహ అన్ని అంశాల్లో నియో ఫ్రెష్ గ్లాస్‌డోర్ చక్కగా ఇమిడిపోతుంది – గీతలు, మరకలనే ఆందోళనకు తావులేకుండా అర్థవంతమైన, అనుకూలమైన శీతలీకరణ పరిష్కారాలను వినియోగదారుకు అందిస్తుంది. ఇన్వర్టర్ టెక్నాలజీ కలిగి ఉంది కాబట్టి ఇవి అత్యంత శక్తి సామర్థ్యంతో పనిచేస్తాయి. పర్యావరణ చైతన్య కలిగిన వినియోగదారులకు ఇది ఉత్తమంగా నిలుస్తుంది.

ఆధునిక భారతీయ గృహాలకు సరిగ్గా సరిపోయే ఈ రిఫ్రిజిరేటర్లు బహుళ రంగులు, సామర్థ్యాలలో లభిస్తున్నాయి. 12 రోజుల వరకు గార్డెన్ తాజాదనాన్ని అందించే అధునాతన సాంకేతికత వీటి ప్రత్యేకత. వీటి సిక్స్త్‌ సెన్స్ డీప్‌ఫ్రీజ్ టెక్నాలజీ ఫ్రీజర్ డోర్ తెరిచినప్పుడు చల్లని గాలి బయటకు రాకుండా నిరోధిస్తుంది. అలాగే మైక్రోబ్లాక్ టెక్నాలజీ మీ పండ్లు, కూరగాయలలో బ్యాక్టీరియా పెరుగుదలను 99% వరకు నిరోధిస్తుంది. హనీకోంబ్ మాయిశ్చర్ లాక్-ఇన్ టెక్నాలజీ కూరగాయల్లో అవసరమైన తేమ నిలిపి ఉంచి అవి తాజాగా ఉండేలా చేస్తుంది. యాక్టివ్ డియోలోని ప్రభావవంత మైన వాసన వ్యతిరేక చర్య రకరకాల వాసనలు ఒకదానితో ఒకటి కలిసిపోకుండా చూస్తుంది.

“నియో ఫ్రెష్ గ్లాస్‌డోర్ శ్రేణి రిఫ్రిజిరేటర్లు వినియోగదారుల జీవితాలు మెరుగుపరిచే, సులభతరం చేసే ఉత్పత్తి అనుభూతి అందించాలనే వర్ల్‌పూల్‌ డిజైన్ ప్రతిభ, నైపుణ్యానికి ప్రతిరూపంగా నిలుస్తాయి. వినియోగదారుల అంచనాల స్వభావం,

ఉత్పత్తి ప్రాధాన్యతలను దృష్టిలో ఉంచుకొని ఆకర్షణీయమైన డిజైన్, స్క్రాచ్ రెసిస్టెంట్ నాణ్యతకు ఈ శ్రేణి ఒక చిహ్నంగా నిలిచిపోతుంది. ఇంధన సామర్థ్యం, ​​శక్తివంతమైన పనితీరు, కళ్లార్పకుండా చేసే డిజైన్‌ను ఒక్క చోట చేర్చి మీ కిచెన్‌
కోసం ఒక శక్తిమంతమైన పరికరాన్నిఅందిస్తున్నాం” అన్నారు వర్ల్‌పూల్ ఆఫ్ ఇండియా మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ కె.జి. సింగ్ క్రిస్టల్ బ్ల్యాక్, క్రిస్టల్ మిర్రర్, పిక్సెల్, గెలాక్సీ ఫినిషెష్‌తో, 265లీ, 292 లీ సామర్థ్యం, 2 స్టార్, 3 స్టార్ ఎనర్జీ రేటింగ్‌తో
ఇవి అందుబాటులుో ఉన్నాయి. నియో ఫ్రెష్ గ్లాస్‌డోర్ ఫ్రాస్ట్-ఫ్రీ రిఫ్రిజిరేటర్లు https://www.whirlpoolindia/com లోనూ, అన్ని ప్రముఖ కన్సుమర్‌ ఎలక్ట్రానిక్‌ రిటెయిల్‌ స్టోర్స్‌లో రూ.33,000 ప్రారంభ ధర వద్ద లభిస్తున్నాయి.

error: Content is protected !!