365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, మే 16,2025: హిందూ, బౌద్ధ సంప్రదాయాలలో విశిష్ట స్థానం కలిగిన వైట్ తారా దేవి మంత్రం, ఆరోగ్యం, దీర్ఘాయువు, కరుణ, ఆధ్యాత్మిక శక్తి కోసం అత్యంత ప్రభావవంతమైన మంత్రంగా పరిగణిస్తారు.

ఈ మంత్రాన్ని నిత్యం జపించడం వల్ల నెమ్మదిగా కానీ స్థిరంగా మన శరీరానికి, మనస్సుకు శుభప్రభావాలు కలుగుతాయని ప్రముఖ ఆధ్యాత్మికగురువులు చెబుతున్నారు.

వైట్ తారా మంత్రం: “ఓం తారే తుత్తారే తురే మమ ఆయుః పున్య జ్ఞాన పుష్టింకురు స్వాహా”.

ఈ మంత్రాన్ని పూజా సమయంలో లేదా ధ్యానం సమయంలో శ్రద్ధగా జపించాలి. ఇది దైవ అనుగ్రహాన్ని అందించడంతో పాటు, ఆత్మశుద్ధి, మానసిక శాంతిని ప్రసాదిస్తుంది. వైట్ తారా దేవి, కరుణామయిగా కష్టాల నుంచి రక్షణ కల్పిస్తుందని భావిస్తారు. ఆమెను భక్తితో ప్రార్థిస్తే బాధల నుంచి విముక్తి కలుగుతుందని విశ్వాసిస్తారు.

White tara mantra..

భక్తుల విశ్వాసం ప్రకారం:

ఈ మంత్రం దీర్ఘాయుష్కాన్ని ప్రసాదిస్తుంది.

శరీరానికి ఆరోగ్యాన్ని, మానసికంగా ప్రశాంతతను ఇస్తుంది.

మనసు, హృదయాన్ని కరుణతో నింపుతుంది.

ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు నడిపిస్తుంది.

ఇది కూడా చదవండి…ZEE5లో 50 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్‌తో దూసుకుపోతోన్న నితిన్ ‘రాబిన్‌హుడ్‌’

Read This also…“Robinhood” Becomes a ZEE5 Summer Sensation with 50 Million Streaming Minutes!

స్నానమాచరించిన అనంతరం ఉదయం లేదా సాయంకాల ధ్యాన సమయంలో దీన్ని 108 సార్లు జపించాలని ఆధ్యాత్మిక గురువులు వెల్లడిస్తున్నారు. రుద్రాక్ష మాలతో మంత్ర జపం చేయడం వల్ల మంత్రశక్తి మరింత పెరుగుతుందని వారు చెబుతున్నారు.

వైట్ తారా మంత్రం జీవనశైలిలో సాంత్వనను, చైతన్యాన్ని నింపగల మంత్రంగానూ, నిత్య జీవితంలో మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలనుకుంటున్న వారికీ ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని ఆధ్యాత్మిక గురువులు చెబుతున్నారు.