365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, సెప్టెంబర్ 1,2024 : పురుషులు, మహిళలు,పిల్లలతో సహా ఎవరైనా కరుంగలి మాల ధరించవచ్చు. అంతేకాదు ఈ మాలను ధ్యానం చేయడానికి, మంత్రాలు పఠించడానికి, దేవుని విగ్రహాలకు మాలగా ఉపయోగిస్తారు. కరుంగలి మాల.. అనేది నల్లటి వృక్షమైన కరుంగలి చెక్కతో తయారు చేస్తారు. ఈ చెట్టు ఆకులు, విత్తనాలు, చెక్క సాంప్రదాయిక ఆరోగ్య ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు. ముఖ్యంగా హిందూ ధర్మంలో కరంగలి చెక్క నుంచి తయారు చేసిన మాలలు చాలా పవిత్రమైనవిగా పరిగణిస్తారు.
కరుంగలి మాల ధరించడంవల్ల ఉపయోగాలు..
ఆధ్యాత్మికత: కరుంగలి మాలలు ప్రధానంగా ధ్యానం, పూజ, జపం కోసం ఉపయోగిస్తారు. ఈ మాలను ధరించడం వలన, క్షుద్ర శక్తుల నుంచి రక్షణ లభిస్తుంది అని విశ్వసిస్తారు.
కరుంగలి మాలను ధరిస్తే రక్త ప్రసరణ సరిగా జరుగుతుంది. శరీరంలో ఉష్ణోగ్రతను నియంత్రించడంలో సహాయపడుతుంది. శాంతి, సమతుల్యత: ఈ మాల ధారణ వలన మనసుకు ప్రశాంతత, దైనందిన జీవితంలో సమతుల్యత లభిస్తుందని నమ్మకం.
దేవతల అనుగ్రహం: కరుంగలి మాలను భక్తులు ధరించడం వలన శివుడు, విష్ణువు, ఇతర దైవాల కరుణతో పాటు, వారి అనుగ్రహం పొందుతారని నమ్ముతారు.
మాల ఎలా ధరించాలి..?
కరుంగలి మాలను సాధారణంగా గురువారం లేదా శివరాత్రి రోజున ధరణ చేసి, ప్రతిరోజు పూజ సమయంలో లేదా ధ్యానం సమయంలో ఉపయోగిస్తారు. కరుంగలి మాల ధరించడం ద్వారా ప్రతిరోజూ రక్షణ, శక్తి , ధ్యానంలో సమగ్రమైన ఫలితాలను పొందవచ్చు.
గమనిక : ఈ మాలలను ధరించడానికి ముందు పూజారి సలహా తీసుకోవడం మంచిది.