365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,శ్రీకాకుళం,ఆగష్టు 30,2022:భర్త మరణాన్ని తట్టుకోలేని భార్య 24 గంటల్లోనే కన్నుమూసిన విషాద ఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకుంది. భర్త సిరిమామిడి పంచాయతీ తోటూరుకు చెందిన సుందరరావు ఉపాధి నిమిత్తం భార్యతో కలిసి బిలాయిలోఉంటున్నారు.
సుందర్‌రావు అనారోగ్యంతో ఆదివారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. భర్త మృతి చెందాడన్న బాధతో భార్య పుణ్యవతి కూడా సోమవారం మధ్యాహ్నం మృతి చెందింది. భార్యాభర్తల మృతితో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు.
సుందరరావు పెద్ద కుమారుడికి వివాహం కాగా, ఈ నెల 20న తమ చిన్న కుమారుడి వివాహం చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ అనివార్య కారణాల వల్ల పెళ్లి వాయిదా పడింది.ఇంతలో సుందర్ రావు మృతి ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది.
సుందరరావు వడ్బలిజ సంక్షేమ సంఘం వ్యవస్థాపక సభ్యునిగా, తోటూరు అరుణోదయ సంఘం అధ్యక్షునిగా సేవలందిస్తున్నారు. ఆయన ఇందిరాగాంధీ విద్యాలయంలో తెలుగు చదువులో ఉపాధ్యాయునిగా కూడా సేవలందిస్తున్నారు.